citadel trailer
Citadel Trailer: టాలీవుడ్ స్టార్ నటి చివరిగా విజయ్ దేవరకొండ సరసన 'ఖుషీ' తర్వాత అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల పాటు సినిమాలను పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. అలా సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న సామ్.. ఇప్పుడు సరికొత్త స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ 'సిటాడెల్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత, వరుణ్ ధావన్ నటించిన ఈ సీరీస్ నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. డార్లింగ్ మొదటి సినిమా రీరిలీజ్
సిటాడెల్ ట్రైలర్
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సీరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో సామ్ యాక్షన్ స్టెంట్స్, ఫైటింగ్, గన్ ఫైరింగ్ సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సీరీస్ పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఈ సీరీస్ లో వరుణ్, సమంత సీక్రెట్ ఏజెంట్స్ గా కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. అంతేకాదు సమంతకు ఒక కూతురు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు సమంత, వరుణ్ సీక్రెట్ మిషన్ ఏంటీ..? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైనా సవాళ్లేంటి అనే కథాంశంతో సీరీస్ ఉండబోతుంది. ఈ సీరీస్ లో కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: వామ్మో ఈ ఆంటీ నక్క తోక తొక్కింది.. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!
Warning⚠️: this tweet contains explosive action and thrilling entertainment!
— prime video IN (@PrimeVideoIN) October 15, 2024
Trailer Out Now: https://t.co/zAHjyvR7P3 #CitadelHoneyBunny, New Series, Nov 7
Also Read: PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా!
ఇది కూడా చదవండి: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్