Hero Vishal: కోలీవుడ్ హీరో విశాల్ ఇటీవలే వేదికపై స్పృహ తప్పి పడిపోవడం కలకలం రేపింది. విల్లుపురం జిల్లా కూవాగంలో నిర్వహించిన అందాల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన విశాల్.. కార్యక్రమం మధ్యలోనే హఠాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
విజయ్ సేతుపతితో విశాల్ పోస్ట్
అయితే ఈ ఘటన తర్వాత విశాల్ తొలిసారి మళ్ళీ సోషల్ మీడియాలో కనిపించారు. హీరో విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫొటోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. నా ప్రియమైన స్నేహితుడు విజయ సేతుపతిని చాలా కాలం తర్వాత చెన్నై విమానాశ్రయంలో కలిసాను. అతడిని చూడడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. కొన్ని నిమిషాలే మేము మాట్లాడుకున్నప్పటికీ.. అతడితో సంభాషించడం అందంగా ఉంది అంటూ పోస్ట్ పెట్టారు. అనారోగ్యానికి గురైన తర్వాత తొలిసారి విశాల్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
Met my darling friend, the most versatile @VijaySethuOffl at Chennai airport. Always nice to see him, he’s full of energy and it's been a long time since I met him. It was really really nice to converse with him even though it was for few minutes.
— Vishal (@VishalKOfficial) May 17, 2025
All the best darling for your… pic.twitter.com/zAIXVJKw8y
ఇది ఇలా ఉంటే విశాల్ ఇటీవలే 'మదగజరాజ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. చిత్రీకరణ తర్వాత సుమారు 12 ఏళ్ళ పాటు విడుదలకు నోచుకోని ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నేళ్లు గడిచినప్పటికీ.. కంటెంట్ బాగుండడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి, సంతానం, సోనూ సూద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
telugu-news | latest-news | cinema-news | actor-vishal | hero-vishal | Vijay Sethupathi
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
Also Read: Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి