/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-22.jpg)
Hero Vishal: నటుడు విశాల్ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పందెం కోడి, పొగరు,భరణి, పూజా, వంటి సూపర్ హిట్ సినిమాలు విశాల్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్లుగా ఉన్నాయి. కాగా విశాల్ నటించిన చివరి సినిమా మార్క్ ఆంటోనీ.
Also Read: Prashant Kishor: పోలీసుల అదుపులో ప్రశాంత్ కిషోర్..ఎయిమ్స్ కు తరలింపు!
విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత విశాల్ బయట కనిపించి చాలా కాలమే అయ్యింది. తాజాగా విశాల్ నటించిన 12 ఏళ్ళ క్రితం నాటి సినిమా ‘మదగజరాజ’ ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ పరిస్థితి చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత బయటకు వచ్చిన విశాల్ అనారోగ్యానికి గురైనట్టు కనిపించాడు.
Take care vishal naa y hand ivolo nadungudhu?🥲 #MadhaGajaRaja pic.twitter.com/LLHjhDFKHp
— Sanjayrant/alterego (@as_rantts) January 5, 2025
నోట్లో నుండి మాట కూడా సరిగా..
ముఖం అంతా వాచిపోయి, మాట్లాడుతున్న సమయంలో చేతులు వణికిపోతూ,నోట్లో నుండి మాట కూడా సరిగా రాలేని పరిస్థితిలో విశాల్ చూసి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన పడుతున్నారు. అసలు విశాల్ కు ఏమైంది అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు విశాల్ తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్నాడని అంటున్నారు.
కానీ అది కాదని ఆ మధ్య ఓ సినిమా షూటింగ్ లో విశాల్ కు తీవ్ర గాయం కారణంగా కంటికి పై భాగంలో నరాలు దెబ్బతిన్నాయని, ఆ గాయం ఇటీవల మళ్లీ ఇబ్బంది పెట్టిందని అందువల్లే విశాల్ పరిస్థితి బాలేదని.. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఏదేమైనా తన సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న విశాల్ ను ఇలా చూడడం బాధపడే విషయం. విశాల్ త్వరగా కోలుకుని తిరిగి సినిమాల్లో నటించాలని అంతా కోరుకుంటున్నారు.
Also Read: Jammu Kashmir: జమ్మూలో విషాదం.. ఊపిరాడక ఐదుగురు మృతి