Prashant Kishor: పోలీసుల అదుపులో ప్రశాంత్‌ కిషోర్‌..ఎయిమ్స్‌ కు తరలింపు!

బీపీఎస్‌సీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌ రెండు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్షచేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున పీకేను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎయిమ్స్‌ కి తరలిస్తున్నారు.

New Update
pk

pk

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ (జేఎస్‌యూపీఏ) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌ రెండు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్షచేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: Gold Rates: దిగొచ్చిన బంగారం.. నేడు మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే?

బలవంతంగా అంబులెన్స్‌లో..

అయితే, పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి పీకేను బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు పోలీసులు. కాగా, ఇక, దీక్ష శిబిరం నుంచి ప్రశాంత్ కిషోర్‌ను నిరాహారదీక్ష స్థలం నుంచి తరలిస్తుండగా అతని మద్దతుదారులు తీవ్రంగా అడ్డుకునేందుకు  ప్రయత్నం చేశారు.. అలాగే, “వందేమాతరం” నినాదాల మధ్యనే పాట్నా పోలీసులు పీకేను అదుపులోకి తీసుకుని అంబులెన్స్‌ లోకి ఎక్కించారు.

Also Read: తిరుపతిలో ఘోర ప్రమాదం..భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్ ఇద్దరు భక్తులు మృతి

అయితే, అంతకుముందు ప్రశాంత్ కిషోర్ సహా అతని 150 మంది మద్దతుదారులపై పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది చట్టవిరుద్ధమైన ఆందోళన అని పేర్కొన్నారు. పాట్నా హైకోర్టు ఆదేశాల ప్రకారం.. గర్దానీ బాగ్‌లోని నిర్దేశిత ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో ధర్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ మతించకూడదని వెల్లడించింది. కానీ, ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదాన్ లో నిరసనకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా, డిసెంబర్ 13న BPSC నిర్వహించిన ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ అభ్యర్థులు గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా జన్ సూరాజ్ చీఫ్ ప్రశాంత్‌ కిషోర్‌  జనవరి 2వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 

Also Read: USA: అమెరికాకు భారతీయుల అక్రమ రవాణా.. వయా కెనడా

Also Read: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

Advertisment
తాజా కథనాలు