జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. శ్రీనగర్ జిల్లాలోని పంద్రథాన్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో ఓ కుటుంబం ఉంటుంది. అకస్మాత్తుగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి వైద్యుని తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది.
ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే
ان لله وانا اليه راجعون
— shahid Nazeer (@askshahid_nazir) January 6, 2025
Heartbreaking incident 😭 in the Pandrethan area of Srinagar, where a family of five, including a father, mother, and their three children, tragically lost their li-ves due to suffocation.#RIP pic.twitter.com/f2hdLWB5ta
ఇది కూడా చూడండి: KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హీటర్ కారణంగానే..
డాక్టర్ వచ్చేలోగా ఆ కుటుంబమంతా మృతి చెందారు. అయితే ఈ విషాదానికి హీటింగ్ పరికరాలనే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గ్యాస్ హీటర్లు వంటివి జాగ్రత్తగా ఉపయోగించకపోవడం వల్ల ఊపిరిఆడలేదని అంటున్నారు. ఎందుకంటే హీటర్ల వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనిని పీల్చడం వల్ల వెంటనే స్పృహతప్పి పడిపోతారు. హీటర్లు వాడేటప్పుడు లోపలకి వెంటిలేషన్ ఉండాలి. లేకపోయిన కూడా ప్రమాదం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా
Police officers carry the bodies of a family of 5, including a father mother , two sons and their 28days old daughter, who tragically lost their lives to suffocation in Pandrethan Srinagar
— Mir Arshid (@MirArshidHussa5) January 5, 2025
💔 💔 💔 💔 💔 pic.twitter.com/IJObXBWcFB
ఇది కూడా చూడండి: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే!