/rtv/media/media_files/2025/07/26/vijay-devarakonda-2025-07-26-16-30-48.jpg)
Vijay Devarakonda
విజయ్ దేవరకొండకు ఏపీలో గట్టి షాక్ తగిలింది. తిరుపతిలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ‘కింగ్‌డమ్’ సినిమా ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అక్కడ భారీ కటౌట్లు కూడా పెట్టారు. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ సందర్భంగా అక్కడ కొందరు నిరసనలు చేపట్టారు.
Also Read : పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!
Vijay Devarakonda Kingdom
గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఆందోళనలు చేపట్టారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అడ్డుకుంటామని గిరిజన సంఘాలు హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమను ఉగ్రవాదులతో పోల్చడాన్ని వారు తప్పుబట్టారు. దీంతో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం వద్ద నిరసనలు చేపట్టగా.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
*గో బ్యాక్ విజయ్ దేవరకొండ*..
— Ashok Rathod 🇮🇳 (@AshokRathod_) July 26, 2025
*గిరిజన సంఘాల JAC* ✊🏻#KingdomTrailer#Tirupati@TheDeverakondapic.twitter.com/REM5X8yrX7
Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!
గిరిజనుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళ హీరో సూర్య నటించిన 'రెట్రో' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీశాయి. కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. "వందల ఏళ్ల క్రితం రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు, గొడవలు చోటు చేసుకునేవి, ఆ ఉద్దేశ్యంతోనే 'ట్రైబ్స్' (తెగలు) అనే పదం వాడాను" అని ఆయన అన్నారు.
Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?
ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని పలు గిరిజన సంఘాలు ఆరోపించాయి. దీనిపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. వివాదం తీవ్రం కావడంతో, విజయ్ దేవరకొండ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెప్పారు. తాను ఉపయోగించిన 'ట్రైబ్స్' పదం ప్రస్తుత షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి కాదని, నాగరికతకు ముందున్న తెగల గురించి అని వివరణ ఇచ్చారు.