NTR vs Lokesh : రజనీకేనా విషెస్‌.. ఎన్టీఆర్‌కు లేవా.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ!

సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు విషెస్‌ చెప్తూ ఏపీ మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

New Update

సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు విషెస్‌ చెప్తూ ఏపీ మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.   ‘ సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్న రజినీకాంత్‌కి శుభాకాంక్షలు. ఆయన యుగంలో పుట్టడం మా అదృష్టం. మా కుటుంబం అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన బలమైన మద్దతు ఎప్పటికీ మరువను. ఆయన కూలీ  సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.  

అయితే అదే రోజున  అంటే ఆగస్టు 14వ తేదీన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. దీంతో రజనీకేనా విషెస్‌.. ఎన్టీఆర్‌కు లేవా..? అంటూ యంగ్  టైగర్ ఫ్యాన్స్ లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇలా చేయడం వెనుక ఉద్దేశం, ఎన్టీఆర్ సినిమాను దెబ్బతీయడమేనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తోడుగా వైసీపీ ఫ్యాన్స్ కూడా మద్దతు ఇస్తున్నారు.  దీంతో  సోషల్‌ మీడియాలో టీడీపీ మద్దతుదారులు, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాగ్వాదం రేగింది. మొత్తానికి లోకేష్ చేసిన ఇండస్ట్రీలో పెద్ద వివాదంగా మారింది. 

కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో  తెరకెక్కిన సినిమా కూలీ. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, శృతి హాసన్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు.  ఈ సినిమాకు 'A' సర్టిఫికెట్ లభించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత రజినీకాంత్ నటించిన సినిమాకు 'A' సర్టిఫికెట్ రావడం విశేషం. ఆగస్టు 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. నాలుగు రోజులకు ముందే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 2న విడుదలయ్యింది. 

వార్ 2 సినిమా గురించి 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన లేటేస్ట్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో  తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే  విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.  

Advertisment
తాజా కథనాలు