Mahavatar Narsimha: రూ. 200 కోట్లతో నరసింహ బాక్సాఫీస్ గర్జన.. యానిమేషన్ చరిత్రలో కొత్త రికార్డు!

యానిమేటెడ్ సీరీస్ 'మహావతార్ నరసింహా' బాక్సాఫీస్ వద్ద నిజమైన పవర్ ప్రదర్శిస్తోంది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, ప్రమోషన్లు లేకపోయినా కాసుల వర్షం కురిపిస్తోంది. హాలీవుడ్ సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ.. ఆధిపత్యం చెలాయిస్తోంది.

New Update

Mahavatar Narsimha:  యానిమేటెడ్ సీరీస్ 'మహావతార్ నరసింహా' బాక్సాఫీస్ వద్ద నిజమైన పవర్ ప్రదర్శిస్తోంది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, ప్రమోషన్లు లేకపోయినా కాసుల వర్షం కురిపిస్తోంది. హాలీవుడ్ సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ.. ఆధిపత్యం చెలాయిస్తోంది. 17 రోజుల్లోనే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఒక భారతీయ యానిమేటెడ్ సీరీస్ ఈ రేంజ్ లో విజయం సాధించడం ఇదే మొదటి సారి! అది కూడా స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టేసి విజయ పరంపర కొనసాగించింది.

రూ. 200 కోట్ల

సాధరణంగా.. హాలీవుడ్ నుంచి వచ్చే యానిమేటెడ్ సినిమాలు మాత్రమే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాగిస్తుంటాయి. ఉదాహరణకు:  'ది లయన్ కింగ్' లేదా 'స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్-వర్స్' వంటివి. కానీ, ఇప్పుడు 'మహా అవతార్ నరసింహ' ఈ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టి, భారతీయ యానిమేషన్ స్థాయిని పెంచింది. భారతీయ యానిమేషన్ చిత్రాలకు ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది.  మహావతార్ నరసింహ రూ. 200 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. 

కల్కి, కాంతర, కేజీ ఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబోలె ఫిల్మ్స్ 'మహావతర్ నరసింహా' సినిమాను రూపొందించింది. దర్శకుడు అశ్విన్ కుమార్ దీనిని తెరకెక్కించారు. మహావతర్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో శ్రీ మహవిష్ణువు పది అవతరాలను యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందులోని మొదటి భాగం 'మహావతార్ నరసింహా '. ఇందులో శ్రీ మహావిష్ణువు నరసింహావతారం చూపించారు.

ఒక పురాణాన్ని యానిమేషన్ రూపంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ అర్థమయ్యేలే తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి రోజు యావరేజ్ వసూల్లు సాధించినప్పటికీ.. ఆ తర్వాత మౌత్ టాక్ ద్వారా ఊపందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. విడుదలైన 17 రోజుల్లోనే రూ. 200 కోట్ల వసూల్లు సాధించింది. 

Also Read:Coolie: అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!

Advertisment
తాజా కథనాలు