పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం..వధువు అన్న,స్నేహితురాలి దుర్మరణం జనగామలో వివాహ రిసెప్షన్ కు హాజరై వెళ్తున్న వధువు కుటుంబ సభ్యుల కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అన్న, స్నేహితురాలు మృతి చెందారు. వధువు తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 11 Nov 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Jagityal: కూతురు పెళ్లి చేసి ఎంతో వేడుకగా అత్తారింటికి పంపించారు. అక్కడ జరిగే రిసెప్షన్ కి కూడా ఎంతో సంబరంగా హాజరై తిరిగి వస్తున్న ఆ కుటుంబంలో అంతులేని విషాదం మిగిలింది. రోడ్డు ప్రమాదంలో వధువు అన్న, తన స్నేహితురాలు మృతి చెందగా.. వధువు తల్లి దండ్రులు కొన ఊపరితో కొట్టమిట్టాడుతున్నారు. ఈ దారుణ ఘటన జగిత్యాల -కరీంనగర్ జాతీయ రహదారి ఫై దరూర్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. Also Read: నేడు సుప్రీంకోర్టు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం ఇంటికి తిరిగి వస్తుండగా... పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..జగిత్యాల పట్టణం...హన్మాన్ వాడలోని శివాజీగనర్ లో నివాసం ఉండే వలిపిరెడ్డి రాజమల్లు-లక్ష్మి ల కుమార్తె సంఘవికి జనగామకు చెందిన యువకుడితో ఈ నెల 8న హన్మకొండలోని ఘనంగా పెళ్లి జరిగింది. జనగామలో శనివారం రాత్రి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా...జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ శివారులో జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పై కారును జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఆదివారం ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఢీకొట్టింది. Also Read: UK Diwali Celebrations: ప్రధాని దీపావళి విందులో మద్యం, మాంసం..! ఆ సమయంలో కారు నడుపుతున్న వధువు అన్న సంకీర్తన్ ఏపీ తిరుపతి జిల్లా నారాయణవనానికి చెందిన యువతి సాధు మునిరాజీ (25) అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి కూతురు తల్లి లక్ష్మి , తండ్రి రాజమల్లు కు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. Also Read: Alert: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్! సంఘవితో కలిసి రాజీ హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. స్నేహితురాలి పెళ్లి కి వచ్చి చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రూరల్ సీఐ కృష్ణారెడ్డి , ఎస్సై సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read: AP Rains: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే! మృతుడి మేనమామ మామిడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. కారును ఢీకొట్టిన బస్సు డైవర్ ను అదుపులో తీసుకున్నారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టిసి బస్సు ముందు టైరు ఊడిపోయి ఉండటం పోలీసులు గుర్తించారు. అయితే.. టైరు ఊడిపోయి ప్రమాదం జరిగిందా? లేక ఢీకొట్టిన సమయంలో టైరు ఓడిపోయిందా? అనే దానిపై డ్రైవర్ తో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కూతురి రిసెప్షన్ వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక పక్క నవ వధువు .. మరో పక్క అన్న మృతదేహాం.. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నతల్లిదండ్రులను చూసి కుటుంబ సభ్యులు, రిసెప్షన్ కు వచ్చిన వారందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆసుపత్రి వాతావరణం అంతా కుటుంబ రోదనలతో నిండిపోయింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి