లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ స్టార్ నటి నయనతార లైఫ్ స్టోరీ పై రూపొందించిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్'. తాజాగా మేకర్స్ ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె సినీ కెరీర్, జీవితంలో ఎదుర్కున్న సవాళ్లు, లవ్ స్టోరీ అంశాలను చూపించారు.

New Update

Nayanthara: నటి నయనతార టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా 'జవాన్' సినిమాతో బాలీవుడ్ లోనూ సత్తా చాటింది.  ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.1148 కోట్ల కలెక్షన్స్ తో 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఇది ఇలా ఉంటే ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లేడీ సూపర్ స్టార్ నయనతార లైఫ్ స్టోరీ పై  'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' అనే డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. 

Also Read: సైలెంట్ గా ధనుష్ కొత్త మూవీ.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది..!

 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్ 

అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇందులో నయన్ సినీ కెరీర్, జీవితంలో ఎదుర్కున్న సవాళ్లు, సక్సెస్, లవ్ స్టోరీ పలు అంశాలను చూపించారు. అలాగే ట్రైలర్ లో ప్రముఖ సెలెబ్రెటీలు రాధా, రానా, నాగార్జున, విఘ్నేష్, తాప్సీ పన్ను నయన్ జీవితం ఎదిగిన తీరు గురించి చెప్పిన మాటలు హైలైట్ గా కనిపించాయి. ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. నయన్ రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో 75 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది. ఐదు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్,  తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, నంది అవార్డు,  7 SIIMA అవార్డులతో సహా అనేక అవార్డులను పొందింది. 

 

Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్‌ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్‌ డే స్పెషల్!

Also Read: టాలీవుడ్ హీరోలపై బండ్ల గణేష్ సెటైర్లు.. టికెట్లకు మాత్రమే CM అవసరం..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు