/rtv/media/media_files/2025/11/10/ustaad-bhagat-singh-2025-11-10-11-32-49.jpg)
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh: మెగా అభిమానులకు ఈ మధ్య వరుస సాంగ్స్ హిట్ కావడంతో ఆనందానికి హద్దులు లేవు. చిరంజీవి(Chiranjeevi) నటించిన “మన శంకర్ వర ప్రసాద్ గారు”లోని మీసాల పిల్ల(Meesaala PillaSong) సాంగ్, రామ్ చరణ్(Ram Charan) నటించిన “పెద్ది”(Peddi)లోని చికిరి(Chikiri Chikiri Song) పాటలు యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాపై పడింది.
Keep your Expectations High
ఆదివారం సాయంత్రం ఒక పవన్ కళ్యాణ్ అభిమాని సోషల్ మీడియాలో మైత్రి మూవీ మేకర్స్‌ను ట్యాగ్ చేస్తూ, “మీసాల పిల్ల హిట్, చికిరి చికిరి హిట్, నెక్స్ట్ మనమే!” అని పోస్ట్ చేశాడు. దానికి మేకర్స్ ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది – “On the job. Keep your expectations high.” (పని జరుగుతోంది… మీ అంచనాలను హైగా పెట్టుకోండి). ఈ ఒక్క మాటతోనే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
Also Read: హోం ఫుడ్‌తో 'ఫౌజీ' సెట్స్‌లో ప్రభాస్ సందడి.. ఫొటోస్ షేర్ చేసిన ఇమాన్వి!
On the job 😎😎
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) November 9, 2025
Keep your expectations high💥💥💥#UstaadBhagatSinghhttps://t.co/vW0JGac5GY
Also Read: 'కే ర్యాంప్' ఎంటర్టైన్మెంట్..! ఇప్పుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే...?
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందిస్తున్నారు. గతంలో పవన్ - DSP కాంబినేషన్‌లో వచ్చిన “గబ్బర్ సింగ్” పాటలు సూపర్ హిట్స్ అయ్యాయి. అందుకే ఇప్పుడు కూడా అదే మేజిక్ రిపీట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: SSMB29 తాజా అప్‌డేట్: 'గ్లోబ్ ట్రాటర్' నుంచి ప్రియాంక చోప్రా లుక్ వచ్చేస్తోంది..!
సినిమా టీమ్ సమాచారం ప్రకారం, “ఉస్తాద్ భగత్ సింగ్” ఫస్ట్ సింగిల్ డిసెంబర్ 31న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ పాట మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో నిలుస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ సీజన్ (2026)లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో “గబ్బర్ సింగ్”తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ జంట ఈసారి కూడా అలాంటి ఎమోషన్, ఎనర్జీని తెరపై చూపిస్తుందా అనే ఉత్కంఠ అందరిలో ఉంది. మొత్తానికి, “ఉస్తాద్ భగత్ సింగ్” ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు వేచి చూస్తుండగా, మేకర్స్ ఇచ్చిన “Keep your expectations high” అన్న మాట ఫ్యాన్స్ హృదయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2025 చివర్లో పవన్ మరోసారి మాస్ ఫెస్టివల్ ఇవ్వబోతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు!
Follow Us