SSMB29 తాజా అప్‌డేట్: 'గ్లోబ్ ట్రాటర్' నుంచి ప్రియాంక చోప్రా లుక్ వచ్చేస్తోంది..!

మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో రూపొందుతున్న SSMB29 పై భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 11న ప్రియాంక చోప్రా లుక్ విడుదల అవుతుంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా టైటిల్‌తో పాటు మహేష్ బాబు లుక్ రిలీజ్ చేయనున్నారు.

New Update
SSMB29

SSMB29

SSMB29: మహేష్ బాబు(Mahesh Babu), దర్శకుడు రాజమౌళి(Rajamouli) కలయికలో వస్తున్న భారీ సినిమా SSMB29 (వర్కింగ్ టైటిల్) చుట్టూ ప్రతి రోజూ ఒక కొత్త టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమా ప్రస్తుతం "గ్లోబ్ ట్రాటర్" (Globe Trotter) పేరుతో పిలుస్తున్నారు. ఇటీవలే మేకర్స్ మలయాళ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రను పరిచయం చేశారు. ఆయన "కుంభ" అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. పోస్టర్‌లో ఆయన ఒక విధంగా శారీరక లోపంతో ఉన్నా, అద్భుతమైన శక్తితో ఉంటాడని చూపించారు. ఈ లుక్‌కి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది.

Also Read: 'గ్లోబ్ ట్రాటర్' కోసం ఇద్దరు ప్రొడ్యూసర్స్.. పెద్ద ప్లానింగే ఇది..!

ఇప్పుడు అభిమానుల దృష్టి హీరో మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ పై ఉంది. కానీ చిత్రబృందం ఆయన లుక్‌ను సినిమా టైటిల్‌తో పాటు ఒకే రోజు విడుదల చేయాలని నిర్ణయించింది. దానికంటే ముందు మాత్రం బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ప్రియాంక పాత్ర పేరు, ఫస్ట్ లుక్ నవంబర్ 11, 2025న బయటకు రానుంది.

Also Read :  ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్‌.. త్వరలోనే పెళ్లి!

ఇది ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వంలో ఆమె నటించడం ప్రత్యేకంగా భావిస్తున్నారు.

Also Read: 'SSMB 29' ఈవెంట్ కు భారీ సెటప్‌.. స్టేజ్ ఎంత పెద్దదో తెలిస్తే..!

SSMB29 Launch Event

సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ నవంబర్ 15, 2025న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ కార్యక్రమం ఇప్పటివరకు భారతదేశంలో ఎప్పుడూ చూడని స్థాయిలో భారీగా నిర్వహించబోతున్నారని సమాచారం. ఈవెంట్ కోసం ప్రత్యేకంగా 100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పుతో స్టేజ్ తయారు చేస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్‌కి లేనంత గ్రాండ్‌గా ఉండబోతోంది. రాజమౌళి అభిమానులకు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.

Also Read: 'కే ర్యాంప్' ఎంటర్టైన్మెంట్..! ఇప్పుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే...?

ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కె.ఎల్. నారాయణ తీసుకున్నారు. సంగీతాన్ని మాస్ట్రో ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి కొత్త అనుభూతిని ఇవ్వనుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

మొత్తానికి, SSMB29 సినిమా ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం రేపుతోంది. నవంబర్ 11న ప్రియాంక చోప్రా లుక్ విడుదల అవ్వడం, నవంబర్ 15న టైటిల్, మహేష్ బాబు లుక్ బయటకు రావడం ఈ నెలను అభిమానులకు పండుగలా మారుస్తుంది.

Advertisment
తాజా కథనాలు