18 Years Of Mega Power Star: ఫుల్ మాస్.. 'పెద్ది' నుంచి చరణ్ కొత్త పోస్టర్ వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్ మొదలు పెట్టి ఈరోజతో 18 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు  చరణ్ కు శుభాకంక్షాలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
peddi

peddi

18 Years Of Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్ మొదలు పెట్టి ఈరోజతో 18 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు  చరణ్ కు శుభాకంక్షాలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.  ఇందులో చరణ్ ట్రైన్ ట్రాక్స్ పై నిల్చొని, సిగరెట్ తాగుతూ మాస్ లుక్ లో కనిపించారు. ఈ పోస్టర్ ప్రస్తుత నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న 'పెద్ది' రామ్ చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. ఈ పోస్టర్ ప్రస్తుత నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

బుచ్చిబాబు ట్వీట్ 

 ''ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి చిత్రం నుంచి అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరిగా, మీ సినిమా ప్రయాణం అద్భుతమైనది! ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్❤️🤗🙏'' అంటూ ట్వీట్ చేశారు. అలాగే 'పెద్ది' గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రియమైన రామ్ చరణ్ అభిమానులారా చరణ్ పెద్ది పాత్ర ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాబోతుంది. అలాగే పెద్ది చిత్రం కూడా మీ అందరి ఫేవరేట్ అవుతుంది! నా మాటలను థియేటర్స్ లో మళ్ళీ గుర్తుచేసుకుందాం అని తెలిపారు. దీంతో  'పెద్ది'  సినిమాపై మెగా ఫ్యాన్స్ అంచనాలు మరింత పెరిగాయి. 

Also Read: Raja Saab Trailer: పోతారు మొత్తం పోతారు..! రాజా సాబ్ ట్రైలర్ టైం ఫిక్స్.. ఏకంగా అన్ని నిమిషాల..?

Advertisment
తాజా కథనాలు