ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం అతిషి అరెస్టు అవుతారని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. '' ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి స్కీమ్స్ కొందరికి నచ్చలేదు. అందుకే ఓ తప్పుడు కేసులో త్వరలోనే సీఎం అతిషిని అరెస్టు చేస్తారు. దీనికన్నా ముందు ఆప్ సీనియర్ నేతల ఇళ్లపై సోదాలు చేస్తారని'' కేజ్రీవాల్ రాసుకొచ్చారు. Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు ఇదిలాఉండగా.. త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే ' మహిళా సమ్మాన్ యోజన' పథకం కింద మహిళలకు ప్రతినెల రూ.2100 ఆర్థిక సాయం చేస్తామని ఆప్ ప్రకటన చేసింది. అలాగే 'సంజీవని యోజన' పథకం కింద సీనియర్ సిటిజన్లందరికీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు ఈ స్కీమ్స్‌కు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈ స్కీమ్స్‌కు సంబంధించి ఢిల్లీ ప్రజలను హెచ్చరిస్తూ ఓ ప్రకటన వార్తా పత్రికలో వచ్చింది. '' మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని ఓ పొలిటికల్ పార్టీ ప్రకటించినట్లు మీడియా కథనాల ద్వారా మాకు తెలిసింది. ఈ స్కీమ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం మా వద్ద లేదు. అలాగే సంజీవని యోజన పథకం కూడా లేదు. ఈ స్కీమ్‌కు సంబంధించి వృద్ధుల వ్యక్తిగత సమాచారం లేదా డేటాను సేకరించే అధికారం ఎవ్వరికీ ఇవ్వలేదని'' మహిళా, శిశు అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు పేర్కొన్నాయి. ఇలా ప్రకటన వచ్చిన నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read: ఇలా తింటున్నారేంట్రా బాబు.. ప్రతి సెకన్‌కు 2 బిర్యానీలు ఆర్డర్ ఇటీవలే సీబీఐ, ఈడీ అధికారుల సమావేశం జరిగిందని.. సీఎం అతిషిని తప్పుడు కేసులో అరెస్టు చేయాలని మాట్లాడుకున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు. మరోవైపు ఈ అంశంపై సీఎం అతిషి కూడా మాట్లాడారు. '' వార్తా పత్రికలో వచ్చిన ప్రకటనను తప్పుబట్టారు. కొంతమంది అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ ఈ నోటీసులు ప్రచూరించింది. ఢిల్లీలో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఆపేందుకు.. అలాగే నాపై తప్పుడు కేసు పెట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని మా దగ్గర సమాచారం ఉంది. వాళ్లు నన్ను అరెస్టు చేసినా న్యాయవ్యస్థ, రాజ్యాంగంపై నాకు నమ్మకం ఉంది. బెయిల్ వస్తుందని'' అతిషి అన్నారు.