Mohan Srivatsa: తన చెప్పుతో తానే కొట్టుకున్న డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ..వీడియో వైరల్ !

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఇందుకు సంంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమా తెరకెక్కింది.

New Update
srivastav

టాలీవుడ్(tollywood) యంగ్ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స(Director Mohan Srivatsa) తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఇందుకు సంంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమా తెరకెక్కింది. 2025 ఆగస్టు 29న థియేటర్లలో వచ్చింది. ఇందులో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్‌. సింహా, సత్యం రాజేశ్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. అయితే సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ థియేటర్స్లో ఆడియన్స్ ఎవ్వరూ రాకపోవడంతో  డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ఎమోషనల్ అయ్యారు.  తాను వెళ్లిన థియేటర్లో కేవలం 10 మంది మాత్రమే ప్రేక్షకులు ఉండటంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏకంగా తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. 

Also Read: Afghanistan big breaking : ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం: 500 మందికి పైగా మృతి

ఈ మేరకు ఓ వీడియోలో డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ..  తన సినిమా ఆడుతున్న థియేటర్‌కు వెళ్లి చూస్తే లోపల 10 మంది కంటే ఎక్కువ ప్రేక్షకులు లేరు. తాను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరినీ సినిమా ఎలా ఉందని అడిగాను. అందరూ బాగుందనే చెప్పారు. అలాగే శనివారం సాయంత్రం తన మనసు బాగా లేక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశాను. తన భార్య మూవీ చూడ్డానికి వెళ్తే నువ్వెళ్లి చూసి రమ్మన్నాను. నా భార్య అరగంటలోనే ఇంటికి వచ్చేసింది. నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడి నా భార్య అలా చేసిందని మోహన్ తెలిపాడు. 

Also Read :  PM Shehbaz Sharif : పరువు పోయిందిగా.. పాక్‌ ప్రధానిని పట్టించుకోని మోదీ

జనాలు ఎందుకు థియేటర్లకు రావడం లేదో

తాను ఇంత మంచి సినిమా తీసినా జనాలు ఎందుకు థియేటర్లకు రావడం లేదో తనకు అర్థం కావట్లేదంటూ మోహన్ వాపోయాడు. ఈ సినిమా కోసం తాను రెండున్నరేళ్లు చాలా కష్టపడ్డానని, ఇక నేను మలయాళ ఇండస్ట్రీకే వెళ్తానని వెళ్లడించాడు. మంచి కంటెంట్ ఉన్న మూవీస్ వస్తే అక్కడి ఆడియన్స్ థియేటర్లకు వెళ్తున్నారని తెలిపాడు. ఓ తెలుగోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలుగు ఆడియన్‌‌కు చూపిస్తానని,  అక్కడ హిట్ కొట్టి నిరూపిస్తానని సవాల్ చేశారు. సినిమా నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటానని చెప్పానని,  ఇప్పుడు అలాగే నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా.అంటూ ఎమోషనల్ అయ్యాడు మోహన్. 

Also Read :  Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఈ రెండు రాశుల వారు చాలా జాగ్రత్త.. గ్రహణాన్ని చూస్తే!

Advertisment
తాజా కథనాలు