Sailesh Kolanu: ఇది కదా కిక్కంటే.. ఒకే ఫ్రేమ్‌లో 19 మంది టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ - రచ్చ రచ్చే

టాలీవుడ్ యంగ్ అండ్ టాప్ డైరెక్టర్స్ అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో సందడి చేశారు. ‘హిట్ 3’తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్న శైలేష్ కొలను ఆ ఫోటోను షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మేరకు ఆ పోస్టుపై తన మనసులో మాటలను శైలేజ్ రాసుకొచ్చాడు.

New Update
tollywood directors in single frame sailesh kolanu shares special meet photo

tollywood directors in single frame sailesh kolanu shares special meet photo

టాలీవుడ్ హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరు. వారిని చూసి అభిమానులు మురిసిపోతూ ఉంటారు. ఇక డైరెక్టర్లకు కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తమ డైరెక్టర్ సినిమా వస్తుందంటే.. జోరుగా సందడి సందడి చేస్తారు. మరి ఆ డైరెక్టర్లంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదూ.. తాజాగా అలాంటిదే జరిగింది. టాలీవుడ్ యాంగ్ డైరెక్టర్లంతా ఒకే చోట కనిపించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అందించారు. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

ఒకే ఫ్రేమ్‌లో డైరెక్టర్స్

శైలేష్‌ కొలను, బుచ్చిబాబు సానా, చందు మొండేటి, పవన్ సాధినేని, సందీప్ రాజ్,  హసిత్ గోలి, రాహుల్ సంకృత్యాన్,  భరత్ కమ్మ, వినోద్ అనంతోజు, వివేక్ ఆత్రేయ, వెంకీ కుడుముల, అనుదీప్,  ఆర్ఎస్ జే స్వరూప్ శ్రీరామ్ ఆదిత్య, సాయి రాజేష్,  మున్నా, వశిష్ఠ, సాగర్ కె చంద్ర డైరెక్టర్లు అందరూ కలిసి ఒకే చోట కనిపించడంతో కారణం ఏంటా? అని అంతా గుసగుసలాడుకుంటున్నారు. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

అయితే వీరంతా ఒకే చోట కలవడానికి ఒక కారణం ఉంది. రీసెంట్‌గా దర్శకుడు శైలేష్ కొలను నాచురల్ స్టార్ నానితో ‘హిట్ 3’ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఇందులో భాగంగానే అతడు తన తోటి డైరెక్టర్స్ అందరినీ ఒక చోట కలిశాడు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పంచుకున్నాడు.  

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

ఈ మేరకు ఆ పోస్టుపై తన మనసులో మాటలను రాసుకొచ్చాడు. ‘‘చాలా కాలంగా మేము కలిసి ఉండాలనుకుంటున్నాము. నా సినిమా విజయాన్ని కష్ట సమయాల్లో నాకు తోడుగా నిలిచిన ఈ వ్యక్తులతో పంచుకోవడం కంటే మంచి మార్గం ఏముంటుంది. మీకు ఇది తెలియకపోవచ్చు కానీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ (TFI)లోని ఈ దర్శకుల బృందం ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. ఒకరినొకరు కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకుంటాం. సినిమాలను సెలబ్రేట్ చేసుకుంటాం. మేమంతా ఒక కుటుంబం’’ అంటూ తెలిపాడు. 

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

hit 3 | saileshkolanu | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు