/rtv/media/media_files/2026/01/09/the-rajasaab-2026-01-09-10-33-08.jpg)
the rajasaab
ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజాసాబ్' సినిమా నేడు థియేటర్లలో విడుదలై మిక్సిడ్ టాక్ సంపాదించుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ మొసళ్లతో థియేటర్లలోకి వెళ్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్(Stunt with Crocodiles viral video) అవుతున్నాయి. మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో మొసళ్లు వైరల్ అవుతున్నాయి. మొసలితో సినిమా చూస్తున్నట్లు, మొసళ్లు థియేటర్లలోకి వచ్చినట్లు ఇలా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ మొసలితో ఉంటుంది.
ఇది కూడా చూడండి: The Raja Saab Twitter Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. దెబ్బకొట్టిన ప్రభాస్.. నిరాశలో ఫ్యాన్స్!
Omg 😱 see the Rebels bring crocodile 🐊 to #RajaSaab movie theatres 🥵🔥💥#Prabhas 🔥🔥🥵 pic.twitter.com/4FuA3V1UdP
— ℙℝ𝔼𝔼𝕋𝕐 (@MySelf_Preety) January 8, 2026
మొసళ్ల పండుగ..
ఈ మూవీ మొత్తానికే మొసలి సీన్(crocodile stunts) హైలెట్ ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అసలు ప్రభాస్ మూవీకి ఈ మొసలి గ్రాఫిక్స్ ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ మొసలి వల్ల సినిమాకు కొంత పబ్లిసిటీ వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. థియేటర్లో ఒక్కోరు మొసళ్లు తీసుకురావడం, బయట మొసళ్లు ఉండటం ఇలా అన్ని ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో.. ఏఐ అని నెటిజన్లు అంటున్నారు. వీటిని చూసి నెటిజన్లు ది రాజాసాబ్ మూవీలా లేదని, మొసళ్ల పండగలా ఉందని అంటున్నారు.
Oreyyy 😭😭😂😂🐊🐊🐊 pic.twitter.com/7C3EqXGTkl
— Prabhas Fan (@ivdsai) January 8, 2026
ఈ సీన్ హైలెట్
ది రాజాసాబ్‌లో లాస్ట్ 30 నిమిషాల మొసలి సీన్ హైలెట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఫస్టాప్ బాగుందని, వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ కామెడీ, అతని ఎనర్జీ, డ్యాన్స్ అన్ని అయితే అభిమానులకు ఫుల్ ట్రీట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా మూవీ ప్రీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. లాస్ట్ 30 నిమిషాలు అయితే సూపర్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. సినిమా మొత్తం మీద చూసుకుంటే పాటలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని, తమన్ బీజీఎం, ప్రభాస్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఈ యాంగిల్‌లో చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. డైరెక్టర్ మారుతి కూడా కథను రాసుకున్న విధంగా స్క్రీన్‌పై చూపించలేకపోయారు. రొటీన్ స్టోరీలో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: The RajaSaab Movie Review: ది రాజాసాబ్ ఫుల్ మూవీ రివ్యూ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను మారుతి ఉపయోగించుకోలేకపోయాడా?
Follow Us