CINEMA: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న 'పాయిజన్ బేబీ' స్.. ఏకంగా అన్ని మిలియన్ వ్యూస్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న- ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ  'థామా' నుంచి విడుదలైన ఇటీవలే విడుదలైన స్పెషల్ సాంగ్  'పాయిజన్ బేబీ' సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

New Update
Poison Baby

Poison Baby

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) - ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ  'థామా' నుంచి విడుదలైన ఇటీవలే విడుదలైన స్పెషల్ సాంగ్  'పాయిజన్ బేబీ' సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. విడుదలైన 24 గంటల్లోనే 19 మిలియన్ పైగా వ్యూస్ తో దుమ్మురేపుతోంది.  ఈ పాటలో బాలీవుడ్ డాన్సింగ్ ఖ్వీన్ మలైకా అరోరా తన ఎనర్జిటిక్ స్టెప్పులతో కుర్రకారును ఊపేస్తోంది.  మలైకా తో పాటు రష్మిక కూడా ఈ పాటలో స్క్రీన్ షేర్ చేసుకోవడం హైలైట్ గా నిలిచింది. 

Also Read :  'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!

మలైకా హాట్ మూవ్స్ 

క్లబ్ సెట్టింగ్ లో చిత్రీకరించిన ఈ పాటలో  మలైకా అరోరా తన సిగ్నేచర్ స్టైల్‌లో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులేసింది. రష్మిక కూడా ఆమెతో పోటీ పడుతూ డ్యాన్స్ ఇరగదీసింది. సచిన్-జిగర్ సంగీతం ఈ పాటకు జాస్మిన్ సాండ్లాస్, సచిన్ జిగర్, దివ్య కుమార్  వోకల్స్ అందించారు. 51 ఏళ్ల వయసులో మలైకా అరోరా హాట్ డ్యాన్స్ మూవ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రష్మిక,  మలైకా కాంబో అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న థియేటర్స్ లో విడుదల కానుంది.  ఇందులో ఆయుష్మాన్ ఖురానా,  నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్, సత్యరాజ్, గీతా అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రష్మిక వ్యాంపైర్ ( రక్తం తాగే పిశాచి) పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ రష్మిక లుక్, సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 

Also Read: Ilaiyaraaja: షాకింగ్ .. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు బాంబ్ బెదిరింపులు..!