/rtv/media/media_files/2025/10/15/ilaiyaraaja-2025-10-15-15-26-08.jpg)
Ilaiyaraaja
చెన్నైలో టి నగర్‌లోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా(ilayaraja) స్టూడియోకు బాంబ్ బెదిరింపులు(bomb-threat) వచ్చినట్లు తెలుస్తోంది. స్టూడియోలో బాంబ్ పెట్టమాని చెబుతూ బెదిరింపు మేయిల్స్ పంపించారు. డైరెక్టర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) కార్యాలయానికి కూడా ఈ బెదిరింపు మేయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ ను రంగంలోకి దించింది. ఇళయ రాజా స్టూడియోకు చేరుకొని స్టూడియో మొత్తం తనిఖీలు నిర్వహించింది.
இளையராஜா அலுவலகத்திற்கு வெடிகுண்டு மிரட்டல்#Ilaiyaraaja | #BombThreat | #TNPolicepic.twitter.com/n2gElWyynT
— PttvOnlinenews (@PttvNewsX) October 14, 2025
Also Read: Pawan Kalyan: మేనల్లుడికి డిప్యూటీ సీఎం అదిరిపోయే విషెస్! ఏం చెప్పారో చూడండి
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
అయితే అక్కడ ఎలాంటి బాంబులు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. తనిఖీ పూర్తయిన తర్వాత, అధికారులు ఈ బెదిరింపు hoax (తప్పుడు వార్త) మెసేజ్ గా గుర్తించారు. స్టూడియోలో అంతా సురక్షితంగా ఉందని నిర్ధారించారు. పోలీసులు మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే దీని వెనుక ఉన్న ఉద్దేశమేంటో తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ అండ్ సిటీ పోలీసులు సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. అయితే బాంబు బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు! గత కొన్ని వారాలుగా చెన్నైలోని పలువురు ప్రముఖులు, సినీ తారలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. విజయ్, త్రిష, నయనతార వంటి అనేక మంది గుర్తితెలియని అడ్రెస్ నుంచి నకిలీ బాంబ్ బెదిరింపులు వచ్చాయి.
Also Read: Riddhi Kumar: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!