మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్! మాటలతోనే ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. సీన్ ఎంత పెద్దదైనా తన డైలాగ్స్ తో కన్విన్స్ చేయడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయనను సినీ ప్రియుల మాటల మాంత్రికుడు అని పిలుస్తారు. నేడు ఈ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు. By Archana 07 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Trivikram Srinivas షేర్ చేయండి Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ రచయత పోసాని దగ్గర రచయితగా మొదలైన ఆయన ప్రయాణం.. ఇండస్ట్రీలోనే అగ్ర దర్శకుడిగా పేరు పొందిన స్థాయికి వెళ్ళింది. ‘స్వయంవరం' సినిమాకు రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ .. ఆపై విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ‘నువ్వే కావాలి’ సినిమాలో తన పదునైన మాటలతో రైటర్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. 'నువ్వే నువ్వే' సినిమాతో డైరెక్టర్ గా ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ సినిమాలు ఒక దానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. 'నువ్వే నువ్వే' సినిమాతో పూర్తి డైరెక్టర్ గా అవతరించిన త్రివిక్రమ్.. ఆ తర్వాత వచ్చిన అతడు, జల్సా, ఖలేజా సినిమాల్లో తన మాటల మ్యాజిక్ తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. దర్శకుడి కంటే ఆయనలోని రచయితను ఎక్కువగా ఇష్టపడేంతలా ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్ ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్స్ 'ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలుకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ, ప్రతి జనరేషన్‌లోనూ ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడినే టార్చ్ బేరర్ అంటారు, 'మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు', 'బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావ్ అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగటం అనవసరం' అంటాడు. 'కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం' వంటి పదునైన డైలాగ్స్ ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. మాటలతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడంలో ఆయనకు ఎవరూ సాటి లేరని అనిపించుకున్నారు. 2018 అజ్ఞాతవాసితో విమర్శపాలైనా త్రివిక్రమ్.. అదే ఏడాదిలో 'అరవింద సమేత' సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాలోని 'టార్చ్ బేరర్' ట్రెండ్ గా నిలిచింది. డైలాగ్ ఆ తర్వాత 'అల వైకుంఠపురం' తో బాక్స్ రికార్డులను షేక్ చేశాడు. Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా #tollywood #director #happy-birthday-trivikram-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి