BREAKING: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్! AP: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వ భూములు అక్రమించారంటూ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆయనకు ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 08 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Kethireddy: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వ భూములు అక్రమించారంటూ అధికారుల ఆయనకు నోటీసులు ఇచ్చారు. దాదాపు 30 ఎకరాల ప్రభుత్వభూమి ఆక్రమణకు గురైనట్లు అధికారుల గుర్తించారు. వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆయనకు ఆదేశాలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే తమ్ముడు, తమ్ముడు భార్య పేరిట భూములు ఉన్నట్లు రికార్డ్స్ ను అధికారులు గుర్తించారు. భూమిలో విలాసవంతమైన ఫామ్‌హౌస్, రేసింగ్ ట్రాక్ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 30 ఎకరాలు కబ్జా?.. కాగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేతిరెడ్డి ఓటమి చెండానికి ఈ ఆక్రమణ భూమి కూడా కారణమైంది. ఆనాడు ప్రతిపక్షాలు ఈ ఆక్రమణ భూమి ఐ టార్గెట్ చేస్తూ కేతిరెడ్డిపై విమర్శల దాడికి దిగాయి. అయితే.. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 904, 905, 908,908 సర్వే నంబర్లు ఉన్న భూమిని అక్కడి రైతుల గాలి వసుమతి నుంచి 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు అప్పటి రెవెన్యూ అధికారులు రికార్డుల్లో ఉంది. కాగా ఈ సర్వే నంబర్లకు ఆనుకుని పక్కనే ఉన్న 908, 909, 910, 616-1 సర్వే నంబర్లు పరిధిలోనే దాదాపు 20 ఎకరాల భూమిని వీరు ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే రైతుల నుంచి కొనులు చేసింది 20 ఎకరాలు కాగా మరో 20 ఎకరాలు ఆక్రమించారని, మొత్తం కలిపి 45 ఎకరాల భూమిలో విలాసవంతమైన ఫామ్ హౌస్, రేస్ ట్రాక్, గుర్రాల కోసం షెడ్లు, చెరువులో బోటింగ్ కోసం సదుపాయాలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ భూమిని తన తమ్ముడు కృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించారు. ధర్మవరం మండల పరిధిలోని మల్లా కాల్వ గ్రామంలో సైతం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాల్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. కాగా ఆక్రమించిన భూములను వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. #dharmavaram #ap-news #illegal-construction #former-mla-kethi-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి