Tapsi: స్టార్ హీరోల సినిమాల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే హీరోయిన్నే మార్చేస్తారు : తాప్సి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యూనరేషన్, విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ల కి రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో నిర్మాతలు రకరకాల మైండ్ సెట్ తో ఉంటారని, కొందరైతే హీరోయిన్నే మార్చేస్తారని అన్నారు. By Anil Kumar 03 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి తెలుగు సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సి.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. 'ఝుమ్మంది నాదం' మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రభాస్, రవితేజ, గోపీచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇక్కడ ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. Also Read : పెరుగు ఎక్కువగా తిన్నా ప్రమాదమేనా? అక్కడ పలు సినిమాలతో మంచి సక్సెస్ అందుకొని నార్త్ లోనే సెటిలయింది. గతేడాది డంకీ, ధక్ ధక్ హిందీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యూనరేషన్, అవాకశాలు తదితర విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. Also Read : సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ డైరెక్టర్ ఆత్మహత్య అందులో వాస్తవం లేదు.. " స్టార్ హీరోల సినిమాల్లో నటించినంత మాత్రాన హీరోయిన్స్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటారని చాలామంది అనుకుంటారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు. నేను కూడా గతంలో షారూఖ్ ఖాన్ నటించిన డంకీ, జుడ్వా 2 చిత్రాల్లో నటించినప్పుడు హీరోలతో పోలిస్తే చాలా చిన్నమొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నా. హీరోయిన్ల కి రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో దర్శకనిర్మాతలు రకరకాల మైండ్ సెట్ తో ఉంటారు. స్టార్ హీరో సినిమాలో ఆఫర్ ఇస్తున్నప్పుడు రెమ్యూనరేషన్ తో పనేముందని కొందరంటే, మరికొందరు మాత్రం సినిమా మొత్తం హీరోపైనే నడుస్తుంది కాబట్టి హీరోయిన్ కి పెద్దగా పనుండదని దాంతో వారికి తోచినంత ఇచ్చింది తీసుకోవాలంటారు. Also Read : హరీష్ శంకర్ కు పవన్ ఆర్డర్స్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' స్క్రిప్ట్‌లో మార్పులు? హీరోయిన్స్ ని మార్చేస్తారు.. మరికొందరైతే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే సింపుల్ గా హీరోయిన్స్ ని మార్చేస్తారు. దీంతో హీరోయిన్లు రెమ్యునేషన్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వస్తూ ఉంటుంది .." అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తాప్సి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. Also Read : ధోని చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్ #bollywood #tollywood #actress-tapsi-pannu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి