ధోని చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్ ఎంఎస్ ధోని క్రికెట్‌కు రిటైర్డ్ అయిన తర్వాత జనాల్లో కలిసి మెలిసి తిరుగుతున్నాడు. తాజాగా ఒక అభిమాని తన బైక్‌పై ధోని సంతకం కావాలని అడగాడు. దీంతో అక్కడకి చేరుకున్న ధోని అభిమాని బైక్‌పై సంతకం పెట్టి ఒక రౌండ్ చక్కర్లు కొట్టాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. By Seetha Ram 03 Nov 2024 in స్పోర్ట్స్ వైరల్ New Update షేర్ చేయండి టీమిండియా మాజీ కెప్టెన్ ధోని క్రికెట్‌కు రిటైర్డ్ అయిన తర్వాత ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. జనాల్లోకి వచ్చి ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న ఫొటో, వీడియో అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! ఇప్పటికి చాలానే వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బైక్‌పై రైడ్ చేస్తున్న వీడియోలు బాగా ట్రెండ్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరోక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఎంఎస్ ధోని అభిమాని ఒకరు తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనుగోలు చేశాడు. అయితే ఆ బైక్‌పై సంతకం చేయాలని ధోనిని కోరాడు. ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు! అభిమాని కోరిక మేరకు తన ఫ్యాన్ కోరిక మేరకు ధోని ఓకే అన్నాడు. ఈ మేరకు అభిమాని కొనుక్కున్న బైక్‌పై సంతకం చేశాడు. అంతేకాకుండా బైక్ చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత అభిమానిని బైక్ పై ఎక్కించుకుని ఒక రౌండ్ చక్కర్లు కొట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. MS DHONI - The inspiration for all 🙇- Mahi is always there for the fans. pic.twitter.com/5OYo1Ms7wz — Johns. (@CricCrazyJohns) November 2, 2024 ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ దీంతో కొందరు షాక్ అవుతున్నారు. ఒక సెలబ్రిటీ ఇలా ఫ్యాన్ కోరిన వెంటనే వెళ్లడం చాలా ఆశ్చర్యంగా ఉందని కొందరు అంటున్నారు. మరికొందరు ఫుల్ ఖుష్ అవుతున్నారు. బైక్ చాలా బాగుంది అని.. దానిపై మహీ రైడ్ మరింత కిర్రాక్‌గా ఉందని ఒకరు కామెంట్ చేశారు. అలాగే ఎలాంటి గర్వం లేకుండా మిస్టర్ కూల్ ఎప్పుడూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటాడు అని మరొకరు రాసుకొచ్చారు. ఇంకొకరేమో.. ధోని సింప్లిసిటీకి మేమంతా ఫిదా అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటిదే మరో వీడియో ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం గతంలో కూడా ధోని ఎంతో మందికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఓ అభిమాని తన బైక్‌పై ధోనీ ఆటోగ్రాఫ్ కావాలని అడగాడు. దీంతో ధోని ఆ బైక్‌పై సంతకం చేసేముందు తన టీషర్ట్‌తో తుడిచి సంతకం చేశాడు. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయియంది. ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇవి మాత్రమే కాకుండా ధోనికి బైక్‌లంటే చాలా ఇష్టం అలా తన గ్యారేజ్‌లో చాలానే బైక్‌లు ఉన్నాయి. వాటిపై రైడ్ చేస్తున్నపుడు కూడా ధోని బాగా వైరల్ అయ్యాడు. #latest-viral-news #ms-dhoni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి