సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ డైరెక్టర్ ఆత్మహత్య

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లో నే ఉరేసుకుని కనిపించారు. ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన రావడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

New Update
sdv

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరులోని తన ఇంట్లో ఉరేసుకుని కనిపించారు. గురుప్రసాద్‌ మూడు రోజుల క్రితమే మరణించారని తెలుస్తోంది. 

ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన రావడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాకతో ఆయన మరణ వార్త బయటికొచ్చింది. కాగా ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. 

Also Read : హరీష్ శంకర్ కు పవన్ ఆర్డర్స్.. 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌' స్క్రిప్ట్‌లో మార్పులు?

ఇక గురు ప్రసాద్ కన్నడలో మఠం, ఎద్దేలు మంజునాథ, రంగనాయక సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాడీగార్డ్, కుష్క, విజిల్, హుడుగురు, మైలారీ, జిగర్తాండ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును సైతం అందుకున్నారు.

Also Read : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు