Tamannah-Vijay Breakup: త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే తమన్నా బ్రేకప్!.. కారణం అదేనా?

హీరోయిన్ తమన్నా నటుడు విజయ్ వర్మ గత రెండేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్నారు. అయితే తాజా నివేదికల ప్రకారం  వీరిద్దరూ బ్రేకప్  చెప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వార్తలపై తమన్నా, విజయ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. 

New Update
Tamannaah Vijay Verma breakup

Tamannaah Vijay Verma breakup

Tamannah-Vijay Breakup: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు, బ్రేకప్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ తర్వాత మనస్పర్థలతో కలిసుండలేక పెళ్ళైన రెండు, మూడేళ్లకే  విడాకులు ప్రకటిస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోయిన్ తమన్నా, ప్రియుడు విజయ్ వర్మతో విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!

తమన్నా బ్రేకప్.. 

గత రెండేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ కి ముగింపు పలికినట్లు తెలుస్తోంది.  తాజా నివేదికల ప్రకారం.. ఇద్దరూ తమ సంబంధాన్ని ముగించి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తమన్నా, విజయ్ వర్మ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇది ఇలా ఉంటే గతేడాది ఈ జంట త్వరలో వివాహం చేసుకోబోతున్నారని,  ముంబైలో కలిసి ఒక ఇల్లు కూడా  కొనుక్కుంటారని వార్తలు వచ్చాయి.  ఇంతలోనే బ్రేకప్ అంటూ వార్తలు రావడంతో అంతా షాకవుతున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరితోఒకరు కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేయడంతో వీళ్ళ బ్రేకప్ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. 

కారణం అదేనా?

గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ తమన్నా భాటియాతో తన సంబంధాన్ని ప్రకటించాడు.  ఒకరినొకరం డేటింగ్ చేసుకుంటున్నాము. నేను సంతోషంగా ఉన్నాను. ఆమెతో పిచ్చిగా ప్రేమలో ఉన్నాను అని తెలిపారు. మరోవైపు తమన్నా కూడా  ఓ ఇంటర్వ్యూలో వివాహం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. త్వరలో వివాహం కూడా జరగవచ్చు అన్నట్లుగా మాట్లాడారు. ఆ మధ్య పలు ఈవెంట్లలో కూడా ఇద్దరు కలిసి కనిపించారు. ఫొటో షూట్లట్లో కూడా పాల్గొన్నారు. ఇలా కొంతకాలం హ్యాపీ రిలేషన్ షిప్ మెయింటైన్ చేసిన.. అంతలోనే విడిపోవడానికి కారణం ఏంటి అనేది అందరికీ ప్రశ్నే?  

Also Read: Santhana Prapthirasthu: భార్య‌ ప్రెగ్నెన్సీ కోసం హీరో తిప్పలు.. 'సంతాన ప్రాప్తిర‌స్తు' టీజర్ చూశారా?

Also Read:  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Advertisment
Advertisment
తాజా కథనాలు