Santhana Prapthirasthu Teaser : యంగ్ బ్యూటీ చాందినీ చౌదరీ- విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'సంతాన ప్రాప్తిరస్తు'. సంజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టీజర్ లాంచ్ చేశారు.
Our film #SanthanaPrapthirasthu teaser is out now! Do show us some love ♥️🤗https://t.co/W8tnaS8tJepic.twitter.com/VIVuuYM6SS
— Chandini Chowdary (@iChandiniC) March 5, 2025
'సంతాన ప్రాప్తిరస్తు'.
ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. అతడి ప్రేమ, పెళ్లి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒత్తిడితో కూడిన ఉద్యోగం మధ్యలో విక్రాంత్ కళ్యాణి (చాందిని చౌదరి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమె తండ్రి నిరాకరించినప్పటికీ ఆమెను వివాహం చేసుకుంటాడు. పిల్లలు పుడితే ఎలాగైనా పెద్దలు తమ వివాహాన్ని అంగీకరిస్తారని అనుకుంటున్న హీరోకు పెద్ద షాక్ ఎదురవుతుంది. తనకు తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉందని తెలుస్తుంది. అదే సమయంలో కళ్యాణి తండ్రి ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని పట్టుబడుతున్నాడు. ఇక ఆ తర్వాత హీరో పిల్లల కోసం పడే పాట్లు.. దాని చుట్టూ ఉండే కామెడీ సన్నివేశాలతో టీజర్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.