Kiran Abbavaraam: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'దిల్ రుబా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 14న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ ఆఫర్ ప్రకటించారు.
Also Read: Sankranthiki Vasthunam: టీవీలో వెంకీ మామ హిస్టరీ క్రియేట్.. 6 గంటల్లో మిలియన్ల వ్యూస్
Eee Bike Meede ❤️#Dilruba#DilrubaFromMarch14thpic.twitter.com/v1qpbMrsJU
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 2, 2025
గిఫ్ట్ గా బైక్
ప్రమోషనల్ కంటెంట్ ద్వారా 'దిల్ రుబా' స్టోరీ ప్లాట్ ఏంటో ముందుగానే చెప్పినవారికి.. తాను సినిమాలో వాడిన బైక్ ని గిఫ్ట్ గా ప్రజెంట్ చేస్తానని చెప్పారు. అంతేకాదు బైక్ గెలిచిన వారితో 'దిల్ రుబా' ఫస్ట్ డే, ఫస్ట్ షో కలిసి చూస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు. విజేతకు బైక్ ని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రజెంట్ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Also read : Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
సెల్యులాయిడ్ ప్రొడక్షన్, యూడ్లీ ఫిలిమ్స్ సంయుక్తంగా 'దిల్ రుబా' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన రుక్సాన్ థిల్లర్ కథానాయికగా నటించగా.. కాథీ డేవిసన్ మరో కీలక పాత్ర పోషించారు. ఇది ఇలా ఉంటే గతేడాది 'క' సూపర్ హిట్ కొట్టాడు కిరణ్. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది.
Also Read :Mika Singh: అందుకే వాళ్లకు ఆ గతి పట్టింది.. బిపాసా దంపతులపై ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్స్!