Bit Coin : మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే.. ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ విలువ అమితంగా పెరిగింది. గత నెల రోజులుగా అయితే దీని ధర పెరుగుతూనే ఉంది. బిట్ కాయిన్ వాల్యూ దాదాపు 60 శాతం పెరిగిందని చెప్పాలి. 2010లో 1000రూ పెట్టుబడి ఉంటే 2, 450 కోట్లు అయిందని చెబుతున్నారు. By Manogna alamuru 25 Nov 2024 | నవీకరించబడింది పై 25 Nov 2024 17:35 IST in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బిట్ కాయిన్ విలువ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. డోనాల్డ్ ట్రంప్ రాకతో ఇన్వెస్టర్లు అందరూ దీనిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దీని విలువ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం బిట్ కాయిన్ లక్ష డాలర్లు దాటి పోయింది. గడచిన వారం రోజుల్లోనే బిట్ కాయిన్ దాదాపు 5 శాతం పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 24వ తేదీ బిట్ కాయిన్ ధర 67,000 డాలర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం ఇది లక్ష డాలర్లు దాటిందని తెలుస్తోంది. ఇదొక ఆర్ధిక సంచలనం అని చెబుతున్నారు. Also Read : డ్రై ఫ్రూట్స్, మానసిక స్థితికి సంబంధమేంటి? వీటిని తింటే నిజంగానే అలా జరుగుతుందా! 2010లో బిట్ కాయిన్ కొని ఉంటే...దాని మీద 1000రూ. లు ఇన్వెస్ట్ చేసి ఉంటే...ఇప్పుడు అది మదుపర్లకు రూ.2,045 కోట్లుగా మారిందని చెబుతున్నారు. 2010లో బిట్ కాయిన్ ఒక్కో నాణెం దాదాపు 0.08 డాలర్లకు ట్రేడ్ అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ.3.38 అన్నమాట. దీని ప్రకారం అప్పుడు బిట్ కాయిన్ మీద 1000 రూ. ఇన్వెస్ట్ చేసి ఉంటే...రూ. 1,000 ÷ రూ. 3.38 = 295.85 BTC.ఈ రోజు బిట్‌కాయిన్ ధర ప్రతి నాణేనికి దాదాపు $98,000 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌కు రూ. 84.45 ప్రస్తుత మారకపు రేటును ఉపయోగించి, 1 బిట్‌కాయిన్ ధర: $98,000 × రూ. 84.45 = రూ. 82,76,100. ఈరోజు మీ 295.85 BTC విలువ: 295.85 BTC × రూ. 82,76,100 అంటే..రూ. 24,47,32,78,185 (రూ. 2,447 కోట్లు).. Also Read : పూజకే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేసే కర్పూరం 14 ఏళ్ళల్లో బిట్ కాయిన్ చాలా పయనించింది. దీని విలువను రాను రాను పెంచుకుంటూ వచ్చింది. దీనికి కారణం ట్రంప్ అధికారంలోకి రావడమే. డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీ కి మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉన్నారు అంతేకాదు అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో బిట్ కాయిన్ ధర భారీగా పెరగడం ప్రారంభించింది దేనికి తోడు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గవచ్చని సంకేతాలు కూడా రావడంతో బిట్ కాయిన్ ర్యాలీకి కారణం అయిందని చెప్పవచ్చు. Also Read : ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. 295కే ఆసిస్ ఆలౌట్ బిట్‌కాయిన్ జర్నీలో కీలక మైలురాళ్లు 1. 2010లో బిట్‌కాయిన్ మొదలైదని చెప్పవచ్చును.మొదట ఇది 10,000 BTC రెండు పిజ్జాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించారు. దాని మొదటి విలువను ఫియట్ కరెన్సీలో సూచిస్తుంది. 2. 2017లో క్రిప్టో బూమ్ సమయంలో బిట్‌కాయిన్ దాని మొదటి ప్రధాన మైలురాయిని చేరుకుంది, ఒక్కో నాణెంకు $20,000 దాటింది. 3. 2020-2021లో టెస్లా , స్క్వేర్ వంటి కంపెనీలు బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడంతో సంస్థాగత దత్తత పెరిగింది. 4. 2023లో యూఎస్ SEC బిట్‌కాయిన్ ఇటిఎఫ్‌లను అనుమతించింది. ఇది సంస్థాగత పెట్టుబడులను తాజా అభిద్ధి చేసింది. 5. 2024లో అంటే ఇప్పుడు బిట్‌కాయిన్.. క్రిప్టో కరెన్సీద భవిష్యత్తు అన్న అంచనాలతో, USలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత, $98,000 కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. Also Read : ఇలా చేస్తే వాళ్ళు మిమల్ని అవసరానికి వాడుకుంటున్నారని అర్థం! ఇండియాలో క్రిప్టో కరెన్సీ.. మనదేశంలో మాత్రం ఇప్పటికీ క్రిప్టో కరెన్సీ పైన చట్టబద్ధత లేదు. దానితోడు క్రిప్టో కరెన్సీ లాభాలపైన 30% పన్ను అమలులో ఉంది. అదీ కాక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజిల పైన కూడా జీఎస్టీ అమల్లో ఉంది. అంతేకాదు పన్ను చెల్లించినంత మాత్రాన క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత ఉన్నట్లు భావించవద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కూడా. అయితే క్రిప్టో ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం అనేది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదం అని ఇప్పటికే పలుమార్లు ఆర్బిఐ గవర్నర్ హెచ్చరించడం విశేషం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ డిజిటల్ రూపీ పేరిట ప్రత్యామ్నాయ వర్చువల్ కరెన్సీ ని కూడా ప్రవేశపెట్టింది. క్రిప్టో కరెన్సీల పైన ఆర్బిఐ కఠినంగా ఉంది. అంతేకాదు దీనిపై నిషేధం విధించాలని కూడా ఆర్బిఐ సూచించింది. #bit-coin #crypto-currency #investments మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి