Supritha Video: ప్లీజ్ సార్ తప్పైపోయింది.. నటి సురేఖవాణి కూతురి గుండెల్లో భయం భయం!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో నటి సురేఖవాణి కూతురు సుప్రిత ఓ వీడియో రిలీజ్ చేసింది. తానుకూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని.. చాలా తప్పైపోయిందంటూ తెలిపింది. వాటిని ప్రమోట్ చేసేవాళ్లను ఫాలో అవొద్దంటూ పేర్కొంది. 

New Update

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. మొన్న వైజాగ్ యూట్యూబర్ నాని, నిన్న మరో యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు మిగతా ఇన్‌ఫ్లూయెన్సర్ల గుండెల్లో భయం మొదలైంది. తమపై కూడా కేసులు నమోదు చేస్తారన్న ఆందోళనలో ఇన్‌ఫ్లూయెన్సర్లు బిక్కు బిక్కుమంటున్నారు.

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా పెద్ద తప్పు చేసాం అంటూ ఇప్పుడు పోలీసులకు క్షమాపణలు వేడుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సైతం అదే విధమైన ఆందోళనలో పడింది. తాను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని.. తప్పైపోయింది క్షమించండి అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇకపై అలా చేయనని తెలిపింది. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లను ఫాలో అవొద్దంటూ అందులో పేర్కొంది. 

సుప్రీత వీడియో ప్రకారం.. ‘‘కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసారు. వాళ్లలో నేను ఒకదాన్ని. అయితే ఇప్పుడు వాటిని ఆపేశాను. దానికి మీ అందరికీ సారీ. మీరెవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వొద్దు. అలా చేసి ఈజీ మనీకి అలవాటు పడొద్దు. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి ఏవైనా యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. అంతేకాకుండా ప్రమోట్ చేస్తున్న వారిని ఫాలోకూడా అవ్వొద్దు.’’ అంటూ చెప్పుకొచ్చింది. 

బయ్యా సన్నీ యాదవ్ పరార్

సన్నీ యాదవ్‌ అలియాస్‌ సందీప్‌పై సుమోటోగా కేసు నమోదు చేశాం అని డీఎస్పీ రవి అన్నారు. అతడు సోషల్ మీడియా ఖాతా (Social Media Accounts) లైన ఇన్‌ స్టా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని అన్నారు. అందువల్లనే అతడిపై నూతన్‌కల్‌ పీఎస్‌లో ఈ నెల 5న కేసు నమోదు చేశాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నారు.

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం వెతుకుతున్నామని అన్నారు. అలాగే సన్నీ యాదవ్‌ ఎక్కడ ఉన్నాడో తమకు ఏమీ తెలియదని అతడి పేరెంట్స్ తెలిపారు. దాదాపు 20 రోజుల నుంచి సన్నీ యాదవ్ ఫోన్ కూడా చేయలేదని వారు పేర్కొన్నారు. అయితే అతడు వేరే దేశంలో ఉన్నాడని తెలుసు కానీ.. ఏ దేశంలో ఉన్నాడో తమకు తెలియదు అని చెప్పుకొచ్చారు. దీని బట్టి చూస్తే సన్నీ యాదవ్ త్వరలో అరెస్టు కాబోతున్నాడని అర్థం అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు