Devisri Prasad : సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ తో చెడింది అక్కడేనా?

'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ థమన్, అజనీష్ లోకనాథ్ లను తీసుకున్నారనే వార్తతో దేవిశ్రీప్రసాద్, సుకుమార్ మధ్య ఎక్కడ చెడింది? అనే కోణంలో నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. దీని ద్వారా పలు విషయాలు బయటికొచ్చాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
dsp1

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2' డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. బిగ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ కాస్టింగ్ దగ్గర్నుంచి టెక్నీకాలిటీ వరకూ ప్రతీదీ ది బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కు నెల రోజులు ఉండగా.. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ ఏకంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ను రంగంలోకి దింపాడు. 

Also Read :  సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్!

నిజానికి 'పుష్ప పార్ట్-1, 'పుష్ప 2' సినిమాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ 'పుష్ప2'  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్.. DSP ని కాదని థమన్, అజనీష్ లోకనాథ్ లను తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగానే అసలు దేవిశ్రీప్రసాద్, సుకుమార్ మధ్య ఎక్కడ చెడింది? అనే కోణంలో నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ డిస్కషన్ ద్వారా కొన్ని విషయాలు బయటికొచ్చాయి.

Also Read : 'గేమ్ ఛేంజర్' ను ఫాలో అవుతున్న 'పుష్ప2'..!?

అక్కడ చెడిందా?

మ్యూజిక్ పరంగా చూసుకుంటే 'పుష్ప పార్ట్-1' సాంగ్స్ హైలైట్ గా నిలిచినప్పటికీ బీజీఎమ్ యావరేజ్ అంటూ విమర్శలు వచ్చాయి. దానికి తోడూ మిక్సింగ్ కూడా ఏమాత్రం బాలేదని టాక్ వచ్చింది. ఒకవేళ సాంగ్స్ కనుక హిట్ కాకపోయి ఉంటే సినిమాకు పెద్ద దెబ్బే పడేది. 'పుష్ప2' బీజియం కోసం దేవిశ్రీప్రసాద్ ను కాదనడం ఇదొక రీజన్ అయితే.. 'పుష్ప2' కంపోజిషన్ టైం లోనే  దేవిశ్రీప్రసాద్ కు సూర్య 'కంగువా' మూవీ ఆఫర్ వచ్చింది. దాంతో DSP 'పుష్ప2' ను పక్కనపెట్టి  'కంగువా' పై కాన్సంట్రేషన్ స్టార్ట్ చేశాడు. 

ఈ విషయం తెలిసి సుకుమార్.. దేవిశ్రీప్రసాద్ పై అసహనం వ్యక్తం చేశారట. ఇక్కడే ఈ ఇద్దరి మధ్య చెడిందని టాక్. 'కంగువా' సాంగ్స్ నుంచి బీజీఎం వరకు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తెలుస్తుంది. 

Also Read : తల్లిని కావాలని ఉంది, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా.. రెండో పెళ్లిపై సమంత

ఇక ఆ ' పుష్ప2'  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారంట. చివరి వరకు కూడా  దేవి నుంచి అనుకున్న స్థాయిలో బీజీఎమ్ రాలేదు. దాంతో పార్ట్-1 లో జరిగిన తప్పు 'పార్ట్ - 2' లో రిపీట్ కాకూడదని డిసైడ్ అయిన సుకుమార్.. 'పుష్ప2' బీజీఎమ్ ను దేవిశ్రీప్రసాద్ తో కాకుండా థమన్, అజనీష్ లోకనాథ్ లతో కంపోజ్ చేయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read  :  'RRR' లో నా సీన్స్ అన్నీ కట్ చేశారు.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన హీరో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు