Samantha: తల్లిని కావాలని ఉంది, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా.. రెండో పెళ్లిపై సమంత

'సిటాడెల్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సమంత తల్లి కావడంపై నోరు విప్పింది. తాను నిజ జీవితంలోనూ తల్లి ఎప్పుడు అవుతానా? అని ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పింది. తల్లి కావడానికి వయసు అనేది అడ్డుకాదని, అదో అద్భుతమైన అనుభవమని పేర్కొంది.

New Update
sa

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తర్వాత 'సిటాడెల్ : హానీ, బన్నీ' సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 8 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ముఖ్యంగా ఇందులో సమంత గ్లామర్ షో, లిప్ లాక్ సీన్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ఏ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తల్లి కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read :  ల్యాండ్‌ అవుతున్న విమానం పై దుండగులు కాల్పులు!

'సిటాడెల్' సిరీస్ లో సామ్ ఓ పాపకు తల్లిగా నటించింది. ఇందులో భాగంగానే తాను నిజ జీవితంలోనూ తల్లి  ఎప్పుడు అవుతానా? అని ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పింది.' సిటాడెల్‌లో తల్లిగా చైల్డ్ ఆర్టిస్టుతో కలిసి పనిచేయడం కొత్త అనుభవం. ఆ పాపతో సెట్‌లో ఉన్నన్నీ రోజులు నా సొంత కూతురితో ఉన్నట్లే అనిపించేది.  తల్లి కావాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను.

Also Read : 'RRR' లో నా సీన్స్ అన్నీ కట్ చేశారు.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన హీరో

ఆ టైం నా జీవితంలో ఎప్పుడొస్తుందో?

ఇప్పుడు అనుకోవడం మరీ ఆలస్యం అని నేను అనుకోవట్లేదు. తల్లి కావడానికి వయసు అనేది అడ్డుకాదని నేను నమ్ముతాను. అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది. అదో అద్భుతమైన అనుభవం. ఆ టైం నా జీవితంలో ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాను. ఈ వయసులో తల్లి కావడం ఏంటని మీరు అంటారేమో.. అది అడ్డంకి అని అయితే నేను అనుకోను' అని తన మనసులో మాట చెప్పుకొచ్చింది. దీంతో సమంత చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

Also Read :  ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు

ఆమె వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాలుగా స్పదింస్తున్నారు. సమంత తల్లి కావాలని ఆశ పడిందంటే.. ఆమె ఫ్యూచర్ లో కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటుందని, ఆమె ఇన్ డైరెక్ట్ గా రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిందని అభిప్రాయ పడుతున్నారు. కాగా నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నసమంత.. నాలుగేళ్లకే అతనితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం సోలో లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

Also Read : పూనకాలు తెప్పించే 'పుష్ప-2' అప్డేట్.. ఇక రచ్చ రచ్చే

Advertisment
Advertisment
తాజా కథనాలు