/rtv/media/media_files/2024/11/12/6NznymBFi79c7mHjOUKX.jpg)
టాలీవుడ్ లో పలు సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బ్లఫ్ మాస్టర్, గాడ్ సే, తిమ్మరుసు, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలతో హీరోగా ఆకట్టుకున్నప్పటికీ సరైన కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేకపోయాడు.
'గాడ్ ఫాదర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవికి పోటీగా తన విలనిజంతో అదరగొట్టిన సత్యదేవ్.. త్వరలోనే 'జీబ్రా' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. అదేంటంటే, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'RRR' లో సత్యదేవ్ కూడా నటించాడట.
Also Read : కోర్టు మెట్లు ఎక్కిన నటి కస్తూరి!
My 16 MINUTES Entire Scenes TRIMMED From #SSRwjamouli #RRR - #SatyaDev 😳😳😳🔥🔥🔥
— GetsCinema (@GetsCinema) November 11, 2024
Looks Like #Rajamouli made a 4 HOURS of Film ✅
pic.twitter.com/vue9EJLZAj
Also Read : పూనకాలు తెప్పించే 'పుష్ప-2' అప్డేట్.. ఇక రచ్చ రచ్చే
అందుకే చెప్పలేదు..
కానీ తన సీన్స్ అన్నీ ఎడిటింగ్ లో తీసేశారని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'RRR' సినిమానా కోసం సత్యదేవ్.. దాదాపు 10 రోజుల పాట పనిచేశాడు. కానీ చివరకొచ్చేసరికి అతనికి సంబంధించి దాదాపు 16 నిమిషాలు సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసేశారట. అయితే మూవీ టీమ్పై ఉన్న గౌరవంతోనే తాను ఈ విషయాన్ని ఇప్పటిదాకా బయట ఎక్కడా చెప్పలేదని.. కాకపోతే ఆ పదిరోజుల వర్క్ చేయడం మాత్రం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చాడు.
Also Read: AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..!
కాగా 'RRR' లో సత్యదేవ్ నటించాడనే విషయం తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాకుండా అతని సీన్స్ ఎడిటింగ్ చేస్తే చేశారు కానీ కనీసం మూవీ టైటిల్ కార్డ్స్‌లోనైనా సత్యదేవ్ పేరు వేసి ఉండాల్సిందిని, ఈ విషయంలో సత్యదేవ్ కు రాజమౌళి అండ్ టీమ్ అన్యాయం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ‘SSMB29’ బిజినెస్ ఊహించడం కష్టమే.. రూ.2,000 కోట్లకు పైగా జరగొచ్చు’