సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్!

హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కర్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఐదారుగురు హీరోలు మాత్రమే కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదన్నారు.

New Update
Komatireddy Venkat Reddy

సినిమా ఇండస్ట్రీ ఐదారుగురి హీరోలదే కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదీ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కర్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 

Also Read:  Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌!

పాన్ ఇండియా పేరుతో సినిమాలు తీశామని.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలంటూ తన దగ్గరికి వచ్చే నిర్మాతలకు ఇక నుంచి సమయం ఇచ్చేది లేదని అన్నారు. ఇక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 

సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు

Also Read:  BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు

రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఐదారుగురు హీరోలు మాత్రమే ఎదుగుతున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల నిజమైన ప్రతిభ కలిగిన నటీనటులకు గుర్తింపు దక్కడం లేదని అన్నారు. సినిమా పరిశ్రమ ఐదారుగురు పెద్దలు, హీరోలది కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదని అన్నారు. 

Also Read:  Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఆయనే..!

అంతేకాకుండి సినిమా కార్మికులు కోసం నిర్మించిన చిత్రపురి కాలనీలో చాలామంది బయటి వ్యక్తులే ఉన్నారని ఆరోపించారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ కేటాయింపులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. మరోవైపు తన దగ్గరకు థియేటర్లు ఇప్పించమని వచ్చే ప్రతి చిన్న సినిమా యూనిట్ కు సహకారం అందిస్తున్నానని చెప్పుకొచ్చారు. 

సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి సీఎం కావాలి

Also Read:  AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..!

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సినీ ఇంస్ట్రీలోని ప్రముఖులను ఉద్దేశించి ఇండస్ట్రీని షేక్ చేసేలా ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నాడు ఎంతో మంది శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. అందులో రాజకీయ ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ వారు కూడా ఉన్నారని తెలిపారు. అయితే కొంతమంది సినిమా వాళ్లు మాత్రం రేవంత్ రెడ్డి పుట్టిన రోజున ఆయనకు శుభాకాంక్షలు తెలపలేదని ఫైర్ అయ్యాడు. ఇందులో భాగంగానే కేవలం సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి మాత్రం సీఎం కావాలని అంటూ ఓ ట్వీట్ షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు