Thaman : దేవిశ్రీప్రసాద్ కు బిగ్ షాక్.. 'పుష్ప2' లోకి తమన్ ఎంట్రీ
'పుష్ప2' కోసం తమన్ రంగంలోకి దిగారట. ఆల్రెడీ బీజియం వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు పది రోజుల పాటూ తమన్ బీజియం వర్క్ పై దృష్టి సారించనున్నారట. సుకుమార్ దగ్గరుండి మరీ తమన్ నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా శ్రద్ద తీసుకుంటున్నట్లు సమాచారం.