'గుంటూరు కారం' రీ రిలీజ్.. అన్ని షోస్ హోస్ ఫుల్, రమణగాడా మజాకా!

మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రాన్ని డిసెంబర్ 31న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ సెంటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బుకింగ్స్ ఓపెన్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి.

New Update
guntur kaaram re release

guntur kaaram re release

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరోగా నటించిన 'గుంటూరు కారం' చిత్రం గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ టాక్ అందుకుంది. మహేశ్ బాబు పాత్రలోని మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను విశేషంగా ఆకట్టుకోగా, ఈ చిత్రంలో ఆయన చేసిన డాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

మహేశ్ తన కెరీర్‌లో ఎప్పుడూ వేయని మాస్ స్టెప్పులను ,మహేష్ ఈ సినిమాలో వేశారు. అందులో శ్రీలీలతో కలిసి చేసిన "కుర్చీ మడతపెట్టి" సాంగ్ అయితే ఈ ఏడాదిలో ఆడియన్స్ నుంచి అత్యంత ఆదరణ పొందిన పాటల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమా మరోసారి రీ రిలీజ్ రూపంలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Also Read : న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే!

డిసెంబర్ 31 ఫ్యాన్స్ కు పండగే..

నూతన సంవత్సరానికి ప్రత్యేక ఆహ్వానంగా, డిసెంబర్ 31న 'గుంటూరు కారం' చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రీ-రిలీజ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ సెంటర్లలో ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమవగా, కొన్ని గంటల వ్యవధిలోనే హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి.

ప్రస్తుతం మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్‌కు మూడేళ్ల సమయం ఉండటంతో, ఈ గ్యాప్‌ను మహేశ్ అభిమానులు ఆయన గత చిత్రాలను రీ-రిలీజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఈ ఏడాది మురారి రీ-రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా రీ-రిలీజ్ అవుతున్న ''గుంటూరు కారం' థియేటర్స్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.

ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు