Re Release: న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే!

న్యూ ఇయర్ సందర్భంగా రీ-రిలీజ్ చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అతున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ హిట్ మూవీ 'హిట్లర్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 'హిట్లర్' తో పాటూ 'సై', 'ఓయ్' సినిమాలు కూడా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 న రీ రిలీజ్ అవుతున్నాయి.

New Update
Re release movies

Re release movies

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. అభిమాన హీరోల పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని, వారు నటించిన సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ అయి థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. 

ఈ ట్రెండ్‌తో అభిమానులు తమ ఫేవరెట్ హీరోల సినిమాలను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూసి ఆనందిస్తున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే, ఈ రీ-రిలీజ్ చిత్రాలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా చాలా మంది నిర్మాతలు స్టార హీరోల హిట్ మూవీస్ ను మళ్లీ విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

త్వరలోనే కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో పలు రీ-రిలీజ్ చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవి 1996లో నటించిన క్లాసిక్ హిట్ మూవీ 'హిట్లర్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 

ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు!

అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జనవరి 1న రీ-రిలీజ్ చేయనున్నారు, దీంతో మెగా ఫ్యాన్స్ థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

అలాగే, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా 'సై' కూడా రీ-రిలీజ్ జాబితాలో చేరింది. నితిన్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమా రగ్బీ ఆటను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి అప్పట్లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని కూడా జనవరి 1న మళ్లీ విడుదల చేయనున్నారు.

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

మరోవైపు, సిద్ధార్థ్, షామిలి జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ 'ఓయ్' రెండోసారి రీ-రిలీజ్ అవుతోంది. గతంలో రీ-రిలీజ్ సమయంలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రాన్ని అభిమానులు మరోసారి థియేటర్లలో చూడబోతున్నారు. 

ఈ మూడు సినిమాలు కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమాకు కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి? ఏ సినిమాను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు? అనేది చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు