Champion: రోషన్ బర్త్ డే సర్ప్రైజ్ .. 'ఛాంపియన్' గ్లింప్స్ అదిరింది

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ బర్త్ డే సందర్భంగా అతని నెక్స్ట్ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. 'ఛాంపియన్' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ వీడియోలో రోషన్ లుక్ అదిరిపోయింది.

New Update

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ కె. రాఘవేందర్రావు దర్శకత్వంలో 'పెళ్లి సందడి' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. 2021లో విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయిన.. ఇందులో శ్రీలీల, రోషన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత దాదాపు 5 ఏళ్ళ గ్యాప్ తీసుకున్న రోషన్.. మరో ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

Also Read: Vijayanagaram: రెచ్చిపోయిన యువకులు.. మహిళా ఎస్‌ఐ జట్టు పట్టుకుని రచ్చ

'ఛాంపియన్'  గ్లింప్స్

ఈరోజు రోషన్ బర్త్ డే (Roshan Birthday) సందర్భంగా అతని నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశారు. నేషనల్ అవార్డు విజేత (National Award Winner)  ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు  'ఛాంపియన్' (Champion). టైటిల్ తో పాటు మూవీ నుంచి రోషన్ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో రోషన్ ఓ ఫుట్ బాల్ ఆటగాడిగా కనిపించడం, మరోవైపు బ్రిటీష్ దళాలతో పోరాడడం వంటి అంశాలు ఆసక్తికరంగా కనిపించాయి. పోరాటయోధుడిగా రోషన్ డైనమిక్ లుక్, విజువల్స్ అదిరిపోయాయి. 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

Also Read: Sumalatha: అసలేమీ లేని చోట గొడవ సృష్టించకండి.. దర్శన్ కాంట్రవసీ పై సుమలత ఫైర్

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్,  కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియాంక దత్, జీకే. మోహన్, జెమినీ కిరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలోని మిగతా నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే ఇందులో ఫీమేల్ లీడ్ గా నటించబోయేదెవరనే విషయం మరింత ఆసక్తిగా మారింది. 

Also Read: Hansika Photos: అబ్బా.. దేశీ లుక్ లో యువరాణిలా ముస్తాబైన హన్సిక.. చూస్తే ఫ్లాట్

Advertisment
తాజా కథనాలు