Sumalatha: అసలేమీ లేని చోట గొడవ సృష్టించకండి.. దర్శన్ కాంట్రవసీ పై సుమలత ఫైర్

నటి సుమలత ఇటీవలే పెట్టిన పోస్టులతో హీరో దర్శన్ ఆమెకు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వైరలయ్యాయి. ఈక్రమంలో తాజాగా సుమలత దీనిపై స్పందించారు. అసలే గొడవా లేనిచోట ఏదో జరిగింది అంటూ వివాదం సృష్టించడం ఆపేయండి. నేను పెట్టిన పోస్టులు ఏ ఒక్కరిని ఉద్దేశించినవి కాదు అని తెలిపారు. 

New Update
actress sumalatha

actress sumalatha

Sumalatha: కన్నడ హీరో దర్శన్- నటి సుమలత మధ్య మంచి అనుబంధం ఉంది.  పలు సందర్భాల్లో కూడా సుమలత  దర్శన్ తన కొడుకులాంటి వాడని చెప్పింది. అయితే తాజాగా దర్శన్ ఆమెను ఆన్ ఫాలో చేయడం, ఆ తర్వాత సుమలత అనుకోకుండా పెట్టిన పోస్ట్ దర్శన్ ని ఉద్దేశించినట్లుగా ఉండడం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దర్శన్ తన కొడుకులాంటి వాడని చెప్పిన సుమలత.. అతడు జైల్లో ఉన్నప్పుడు కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు. అదే కోపంతో దర్శన్ ఆమెను అన్ ఫాలో చేశాడని, అందువల్లే  ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చర్చ మొదలైంది.  

సుమలత పోస్టు

ఈ నేపథ్యంలో తాజాగా నటి సుమలత ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్టును షేర్ చేశారు. దర్శన్ ఇన్‌స్టాగ్రామ్‌ లో ఎవరినీ ఫాలో అవడం లేదనే విషయం నాకు మీడియా ద్వారానే తెలిసింది. దర్శన్ అన్ ఫాలో అవడం, ఆ తర్వాత నేను పోస్టులు పెట్టడం అనేది అనుకోకుండా జరిగిన విషయం. అంతేతప్పా అందులో ఏమీ లేదు. దీన్ని ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అసలే గొడవా లేనిచోట ఏదో జరిగింది అంటూ వివాదం సృష్టించడం ఆపేయండి. నేను పెట్టిన పోస్టులు ఏ ఒక్కరిని ఉద్దేశించినవి కాదు అని తెలిపారు. 

అసలేం జరిగింది.. 

అయితే దర్శన్ కొన్నేళ్లుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో అవుతున్న ఆరుగురిని ఆన్ ఫాలో కొట్టాడు. ఇందులో నటి సుమలత, ఆమె కొడుకు  అభిషేక్ అంబరీష్ ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. ఆ తర్వాత సుమలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఆసక్తికరమైన పోస్ట్ ను షేర్ చేశారు. సత్యాన్ని వక్రీకరించి,  పశ్చాత్తాపం లేకుండా ఇతరులను నిందిస్తూ వారిని వారు హీరోలుగా పరిగణించుకుంటున్నారు. ఇలాంటి వారికి ఆస్కార్ ఇవ్వాలి అని పోస్టులో రాసుకొచ్చింది. దీంతో సుమలత దర్శన్ ని ఉద్దేశించే ఆ పోస్ట్ చేసిందని, వీరిద్దరి మధ్య బంధం పూర్తిగా చెడిపోయిందని వార్తలు వైరల్ అయ్యాయి. 

ఇది కూడా చూడండి:Kartik Aaryan: కార్తిక్‌ ఆర్యన్‌, శ్రీలీల డేటింగ్‌.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?

Advertisment
తాజా కథనాలు