/rtv/media/media_files/2025/08/05/raksha-bandhan-2025-2025-08-05-19-55-23.jpg)
Raksha Bandhan 2025
Raksha Bandhan 2025: హిందూ సంప్రదాయాలలో రాఖీ పండగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండగే రక్షా బంధన్. అక్కా చెల్లెళ్లు అన్నాదమ్ముల క్షేమాన్ని, సుఖ సంతోషాలను కోరుకుంటూ వారి చేతి మణికట్టు చుట్టూ రక్షాబంధనాన్ని కడతారు. రాఖీ కట్టిన తర్వాత తోబుట్టువులకు స్వీట్ తినిపించి, హారతినిచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. దీనికి ప్రతిగా సోదరుడు తన సోదరికి ఎల్లవేళలా తోడుగా ఉంటానని హామీ ఇస్తాడు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నా చెల్లెల్లు, అక్కాతమ్ములు మాత్రమే జరుపుకునేది కాదు. స్నేహితులు, భార్యాభర్తలు కూడా ఒకరికొకరం తోడుగా, రక్షగా ఉన్నామని తెలియజేస్తూ రక్షాబంధనాన్ని కట్టుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు. అలా ఈ ఏడాది ఆగస్టు 9న రక్షాబంధన్ వచ్చింది. అయితే సోదరులకు రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలలను పాటించడం ద్వారా సానుకూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రాఖీ కట్టేటప్పుడు ఈ 5 తప్పులు మాత్రం చేయకూడదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ తప్పులు చేయరాదు..
నలుపు రంగు దుస్తులు..
సాధారణంగా హిందూ మత విశ్వాసాల ప్రకారం నలుపు రంగును అశుభంగా భావిస్తారు. కావున రాఖీ పండగ రోజున సోదరుడి మణికట్టుపై నలుపు రంగు రాఖీలు అస్సలు కట్టకూడదు. పసుపు లేదా కుంకుమ రంగులో రాఖీలను కట్టడం ద్వారా సానుకూల ప్రభావం ఉంటుంది. ఎరుపు, పసుపు రంగులు శుభాన్ని సూచిస్తాయి. అలాగే నలుపు రంగు దుస్తువులు కూడా ధరించకూడదు. ఈ రంగు దుస్తువులతో రాఖీ కడితే సోదరీసోదరీమణుల మధ్య వివాదాలు, మనస్పర్థలు ఏర్పడతాయని విశ్వాసం.
భద్రకాల సమయం
రాఖీ పండగ రక్షాబంధనాన్ని కట్టే సమయం చాలా ముఖ్యమైనది. అశుభ ఘడియల్లో రాఖీ కట్టడం ద్వారా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా భద్రకాల సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు. భద్రకాల సమయం ఆగస్టు 2:12 PM ప్రారంభమై.. ఆగస్టు 9 1:52 AM ముగుస్తుంది. ఈ టైంలో రాఖీ అస్సలు కట్టకూడదు. ఇలా కడితే తోబుట్టువుల మధ్య దూరం ఏర్పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
విరిగిన బియ్యం
సోదరుడికి రాఖీ కట్టే ముందు అక్షింతల కోసం బియ్యం కలిపేటప్పుడు బియ్యం విరిగిపోకుండా చూసుకోండి. విరిగిన బియ్యం గింజలను అశుభంగా భావిస్తారు. అక్షింతలు విరగకుండా జాగ్రత్తగా కలపాలి.
పాత గొడవలు..
రాఖీ పండుగ రోజు పొరపాటున కూడా గతంలో మీకు మీ సోదరుడి మధ్య జరిగిన గొడవలను మళ్ళీ గుర్తుచేయరాదు.ఇది పండగ ఆనందాన్ని, వాతావరణాన్ని పాడు చేస్తోంది. రక్షా బంధన్ పండగ కొత్త ఆరంభానికి అవకాశం అందిస్తుంది. కావున ఆ శుభ సమయాన పాత గొడవలను మర్చిపోయి సోదరసోదరీమణులు సంతోషంగా ఉండాలి.
బహుమతి కోసం బాధ
సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత బహుమతి ఇవ్వలేదని, చిన్న బహుమతి ఇచ్చాడని బాధపడకూడదు. రక్షాబంధన్ అనేది బహుమతుల కోసం చేసుకునేది కాదు, తోబుట్టువుల అనుబంధానికి, ప్రేమకు గుర్తుగా చేసుకునేది. కావున సోదరుడు ఇచ్చే బహుమతి చిన్నదైనా, పెద్దదైన మనస్ఫూర్తిగా స్వీకరించండి.
Also Read:Folk Song: 'బొంబైకి రాను' తర్వాత మరో పాటతో దుమ్మురేపుతున్న రాము రాథోడ్ .. ప్రోమో చూశారా