Rishab Shetty: ‘కాంతారా’ హీరో తెలుగు ఎంట్రీ షురూ..! సర్ప్రైజ్ పోస్టర్ అదుర్స్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించడంలో పేరు గాంచింది. రీసెంట్ గా డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలను నిర్మించి  బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది.

New Update
rishab shetty new project

rishab shetty new project

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించడంలో పేరు గాంచింది. రీసెంట్ గా డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలను నిర్మించి  బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' తో మరో హిట్ డెలివరీ చేసేందుకు సిద్ధమవుతోంది. బోల్డ్ స్టోరీ ఎంపికలతో మార్కెట్ లో తమ స్థాయిని పెంచుకుంటున్న ఈ సంస్థ.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సింగ్నల్ ఇచ్చింది. 

Also Read :  గుర్రపు స్వారీలో బాంధవి శ్రీధర్ అందాలు.. హాట్ లుక్స్‌లో మెరిసిపోతుందిగా!

తెలుగులో రిషబ్ శెట్టి ఎంట్రీ

కోలీవుడ్ డివైన్ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా కొత్త సినిమాను ప్రకటించింది. 18వ శతాబ్దంలో బెంగాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను ఉండబోతుంది.  ఆ సమయంలో బెంగాల్లో నెలకొన్న అశాంతి, తిరుగుబాటు సంఘటనలను ఆధారంగా చేసుకొని  ఒక ఫిక్షనల్ హిస్టారికల్ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు(Ashwin Gangaraju) దర్శకత్వం వహిస్తున్నారు. శిఖర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.   ఈ సినిమాతో రిషబ్ శెట్టి టాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

'కాంతార: చాప్టర్ 1'

ఈ సినిమాతో రిషబ్ శెట్టి టాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి ప్రస్తుతం 'కాంతార: చాప్టర్ 1' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలియజేస్తూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. మేకింగ్ వీడియోలో విజువల్స్, లొకేషన్స్, యాక్షన్ సీన్స్ చూస్తుంటే 'కాంతార' పార్ట్ 1 ని మించి పార్ట్ 2 ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు ఆయనే మూవీని డైరెక్ట్ చేశారు. 2022లో విడుదలైన 'కాంతార' సీక్వెల్ గా 'కాంతార: చాప్టర్ 1' తెరకెక్కించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.  ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబోలే ఫిల్మ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. 

నేషనల్ అవార్డు 

కర్ణాటక తీర ప్రాంతాలోని ప్రజలు ఆచరించే  'భూతకోలా' సంప్రదాయం నేపథ్యంలో రూపొందిన  'కాంతారా' ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందింది.  ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన కూడా మంచి మార్కులు పడ్డాయి. రిషబ్ నటనకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వరించింది. 'కాంతార' విజయంతో రిషబ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అన్ని భాషల్లో ఈయన ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. 

Also Read: Sonali Bendre: వింటేజ్ అందాలు.. గులాబి చీరలో మెరిసిపోతున్న 50 ఏళ్ళ నటి!

latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news | kantara-prequel | kantara-chapter-1 | rishab-shetty | latest tollywood updates

Advertisment
తాజా కథనాలు