SIIMA 2025: దుబాయ్ లో కన్నుల పండుగగా సైమా..అవార్డులు కొల్లగొట్టిన పుష్ప-2, కల్కి

దుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌..సైమా పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. మొదటి రోజు తెలుగు, కన్నడ సినీఅవార్డులను ప్రదానం చేశారు. ఈ 13వ సైమా వేడుకల్లో తెలుగులో పుష్ప2 , కల్కి సినిమాలు ఎక్కువ అవార్డులను సొంతం చేసుకున్నాయి. 

New Update
SIIMA

SIIMA Awards 2025 In Dubai

బాలీవుడ్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఎంత ముఖ్యమూ సౌత్ సినిమాలకు సైమా అవార్డులు అంత ముఖ్యం. ప్రతీ ఏడాది ఈ అవార్డులను పండుగను ఘనంగా, వేడుకగా నిర్వహిస్తారు. దీని కోసం పెద్ద పెద్ద తారలు సైతం తరలి వస్తారు. ఈ ఏడాది సైమా అవార్డుల సినీ పండుగ దుబాయ్ లో జరుగుతోంది. 2024 ఏడాది ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, మిగతా టెక్నిషియన్లకు అవార్డులు అందించారు. 

సైమా అవార్డుల వేడుకలో మొదటిరోజు తెలుగు, కన్నడ చిత్రాలకు అవార్డులను అందించారు. తెలుగులో కల్కి , పుష్ప 2 సినిమాలు హవా నడిపించాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన వారికే ఎక్కవు అవార్డులు వచ్చాయి. సైన్ ఫిక్షన్, మైథాలజీ కలగలుపుగా వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా ఉత్తమ సినిమాగా...పుష్ప2  హీరో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక ఉత్తమ నటిగా అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడి కేటగిరీలో దేవీ శ్రీ ప్రసాద్ అవార్డ్ ను సొంతం చేసుకున్నాడు. 

తెలుగు సినిమా అవార్డుల లిస్ట్ ఇదే..

ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప2) 
ఉత్తమ నటి: రష్మిక (పుష్ప2)  
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప2) 
ఉత్తమ విలన్‌: కమల్‌ హాసన్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్‌ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్‌ (పుష్ప2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)
ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్‌ (చుట్టమల్లే)
ఉత్తమ పరిచయ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్‌ బచ్చన్‌)
ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజ సజ్జా (హనుమాన్‌) 
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)
ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్‌)

Also Read: Look out Notices: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై లుక్ అవుట్ నోటీసులు

Advertisment
తాజా కథనాలు