Look out Notices: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై లుక్ అవుట్ నోటీసులు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ముంబై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఓ వ్యాపార ఒప్పందంలో తనను రూ.60 కోట్లు మోసం చేశారని దీపక్ కొఠారి అనే వ్యాపార వేత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

New Update
shilpa

Shipla Shetti, Raj Kundra

ఓ వ్యాపార ఒప్పందంలో తనను శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు మోసం చేశారని దీపక్ కొఠారీ అనే వ్యాపారి కంప్లైంట్ చేశారు. వ్యాపార విస్తరణ పేరుతో డబ్బు వసూలు చేసి వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణలు చేశారు. గత నెలలో ఈ కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై పోలీసులు తాజాగా  శిల్పాశెట్టి, రాజ్ లపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఆర్థిక నేరాల విభాగం అధికార వర్గాల సమాచారం ప్రకారం శిల్పాశెట్టి దంపతుల ట్రావెల్ లాగ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. వారి సంస్థ ఆడిటర్లను సైతం విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు కేసు విచారణ సమయంలో దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు. గత నెల నుంచీ ఈ కేసుపై విచారణ జరుగుతోందని...అయినా కూడా శిల్పాశెట్టి దంపతులు విదేశాలకు వెళుతున్నారని పోలీసులు తెలిపారు. దానిని కట్టడి చేసేందుకే ఈ లుకౌట్ నోటీసులని తెలిపారు. 

దివాలా సంస్థ అభివృద్ధికి అప్పులు..

దీపక్ కొఠారి దగ్గర రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలు 2016లో డబ్బులు తీసుకున్నారు. తన డబ్బు ఒక నిర్దిష్ట కాలంలో 12% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లిస్తామని శిల్పాశెట్టి దంపతులు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి లిఖిత పూర్వక హామీను కూడా రాసిచ్చారు. కానీ కొన్ని నెలల్లోనే ఏ కంపెనీ విస్తరణ కోసం అయితే డబ్బులు తీసుకున్నారు...దాని డైరెక్టర్ పదవి నుంచి శిల్పాశెట్టి తప్పుకున్నారు. ఆ తరువాత ఆ సంస్థ దివాలా తీసింది. ఇప్పటికీ దాని తాలూకా రూ.1.28 కోట్ల దివాళా కేసు ఇప్పటికే కొనసాగుతోందని...తనకు మాత్రం దానికి సంబంధించి ఏ సమాచారం ఇవ్వలేదని దీపక్ ఆరోపించారు. పైగా ఆ విషయం దాచి పెట్టి మరీ తన దగ్గర విడతల వారీగా డబ్బులు తీసుకున్నారని చెప్పారు. 

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై ఇలాంటి కేసులు నమోదవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి కేసులు వారిపై నమోదయ్యాయి. ఇక, శిల్ప భర్త రాజ్‌ కుంద్రా ఐపీఎల్ వ్యవహారంలోనూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే రాజ్ కుంద్రా నీలి చిత్రాలను తీస్తారు తనను మోసం చేశారంటూ ఒక నటి ఫిర్యాదు చేయడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. 

Advertisment
తాజా కథనాలు