Free Ration : ఉచితాలు తగ్గించాలి.. మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్

ప్రభుత్వంపై మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్ చేశారు.  ఉచితాలు తగ్గించాలని..  అర్హులకే  మాత్రమే ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు కిలో బియ్యం రూ.60 ఉండగా ఉచితాలు ఇవ్వడం సరికాదన్నారు. తినడానికి లేనివారికే బియ్యం ఇవ్వాలని చెప్పారు.

author-image
By Krishna
New Update
thumnmala comments

thumnmala comments

ప్రభుత్వంపై మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్ చేశారు.  ఉచితాలు తగ్గించాలని..  అర్హులకే  మాత్రమే ఇవ్వాలని చెప్పారు. కిలో రూ.3 ఉన్న బియ్యాన్ని రూ.2కే ఇస్తే అప్పుడు ఎన్టీఆర్ ని దేవుడు అన్నారని తుమ్మల గుర్తుచేశారు.  ఇప్పుడు కిలో బియ్యం రూ.60 ఉండగా ఉచితాలు ఇవ్వడం సరికాదన్నారు. రాష్ట్రంలో కోటి పది లక్షల కుటుంబాలు ఉంటే.. కోటి పాతిక లక్షల రేషన్ కార్డులు ఉన్నాయిని.. తినడానికి లేనివారికే బియ్యం ఇవ్వాలని తుమ్మల చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!

ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?

Also Read :  దుబాయ్ లో భారత బిలయనీర్ కు ఐదేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ

కౌలు రైతులకు రైతు భరోసా

రాష్ట్రంలో అందరూ పేదలు లేరని..  తినడానికి లేనివారికే బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి ఇవ్వొద్దని తుమ్మల వెల్లడించారు.  వికారాబాద్‌ జిల్లా ధారూరులోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన తుమ్మల ఈ కామెంట్స్ చేశారు. కౌలు రైతులకు రైతు భరోసా ఎలా ఇద్దామన్నదానిపై మీ సలహాలు కూడా ఇవ్వాలని ఆయన రైతులను, ప్రజలను కోరారు.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్

 

vikarabad | thummala-nageshwara-rao | Free ration

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు