/rtv/media/media_files/2025/05/06/4cZg8furS0qa95eEC3aO.jpg)
No Phones In Classrooms
ప్రస్తుతం కాలంలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. తిన్నా, తినకున్నా, పడుకున్నా, మెలకువగా ఉన్నా చేతిలో మొబైల్ లేకుండా జీవితాలు సాగించలేని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు అందరికీ సెల్ పోన్ ఒక వ్యసనంగా మారింది. కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని చదువుకునే పిలగాండ్ల చేతికి మొబైల్ ఫోన్లు వచ్చి చేరాయి. కరోనా పోయినా సెల్ పోన్ల వాడకం మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో అన్ని దేశాల్లో తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావడం పరిపాటిగా మారింది. విద్యపై దృష్టి సారించడం కన్నా క్లాస్ రూముల్లో మొబైల్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నవారు కూడా ఉన్నారు. మన దేశంలో క్లాసురూముల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావడంపై కాస్త కఠినంగానే వ్యవహరిస్తారు. కానీ యూరప్ దేశాల్లో మాత్రం ఇది సర్వసాధారణం. అయితే ఇటీవల ఏపీలోని ఒక కాలేజీలో సెల్‌పోన్ విషయంలో విద్యార్థినికి, లెక్చరర్‌కు మధ్య జరిగిన వివాదం రెండు తెలుగు రాష్ర్టా్ల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
No Phones In Classrooms
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకునేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రూరల్ ఏరియాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు పాఠాలు చెప్పకుండా ఫోన్ వాడుతున్నట్లు ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు డీఈఓలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆయా తరగతి గదుల్లో విద్యార్థులు తక్కువగా ఉంటుండటంతో క్లాసులు చెప్పడం కంటే సెల్ పోన్ వాడకంలోనే టీచర్లు ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో తరుచూ టీచర్ల ఫోన్ల వాడకంపై విమర్శలు వస్తుండడంతో అడ్మిషన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యాశాఖ భావించింది. అందుకే ఇటీవల మూడు రోజులు ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో జరిగిన డీఈఓలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లకు శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డీఈఓలకు పలు సూచనలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో ఫోన్లు వాడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డీఈఓలకు సూచించారు. స్కూళ్లను ఆకస్మిక తనిఖీలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read : TGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...
తాజా విద్యా సంస్కరణల్లో భాగంగా పలు దేశాలు కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నాయి. గత ఏడాది నెదర్లాండ్స్ లో క్లాసురూముల్లోకి మొబైల్ ఫోన్లను నిషేధించింది. పాఠాలకు అంతరాయం కలిగించే మొబైల్ ఫోన్లను క్లాసురూముల్లోకి తీసుకురాకుండా నిషేధిస్తున్నామని అక్కడి ప్రభుత్వం మంగళవారం తెలిపింది. మొబైల్‌లు, ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు విద్యార్థుల అభ్యాసానికి ఆటంకం కలిగిస్తున్నాయని, వాటిని వచ్చే ఏడాది నుంచి తరగతిలోకి అనుమతించబోమని డచ్ ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
mobile-users | teachers | no-phones