/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్(Radhika Sarathkumar) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి గీత (86) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలం నుంచి ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆమె మృతి చెందారు. గీత మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత సీనియర్ నటుడు అయిన ఎం.ఆర్.రాధ భార్య అయిన గీత తమిళ చిత్ర పరిశ్రమంతో పాటు సమాజానికి ఎంతో సేవ చేశారు. పేద ప్రజలకు ఆమె చేసిన మేలు చెప్పక్కర్లేదు. తన జీవితాన్నే ఆమె పేదల కోసం అంకితం చేశారు. అయితే గీత అంత్యక్రియలను నేడు సాయంత్రం 4:30 గంటలకు చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.
Also Read : దానయ్య తాత.. ఓజీ ట్రైలర్ ఇంకెప్పుడు.. హార్డ్ డిస్క్ ఎవరైనా ఎత్తుకెళ్లారా?
Radhika's Mother Passes Away
கீதா ராதா (86) காலமானார்#GeethaRadha | #RIP | #Radhika | #Niroshapic.twitter.com/BO0STYo9pQ
— PolimerTV (@polimertv) September 22, 2025
Also Read : ‘OG’ ట్రైలర్ రిలీజ్.. వణుకు పుట్టిస్తున్న పవన్ యాక్షన్