/rtv/media/media_files/2025/09/21/pawan-2-2025-09-21-21-40-46.jpg)
ఓజీ ట్రైలర్ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేసినప్పటికీ ఎవరికి కనిపించలేదు. ఆన్ లైన్ లో కూడా ట్రైలర్ ను ఇంకా రిలీజ్ చేయలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ లో నిర్మాణ సంస్థ డీవీవీ, డైరెక్టర్ సుజీత్ పై మండిపడుతున్నారు. ఇంకెప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారు... ట్రైలర్ ఉందా లేదంటే హార్డ్ డిస్క్ ఎవరైనా ఎత్తుకెళ్లారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చాలా సేపటి నుంచి ట్రైలర్ కోసం చూస్తున్నామని లాస్ట్ మినేట్ లో ఏంటీ ట్విస్ట్ అని మండిపడుతున్నారు.
Trailer Undha Hard disk Dengipoyadaa Avadainaa ... Officelo @DVVMovies#OG#TheyCallHimOG#OGTrailerhttps://t.co/qExGtIHSwt
— GB4X (@Goodboy4X) September 21, 2025
Trailer ekkadra munxa @DVVMovies#TheyCallHimOG#OGTrailerpic.twitter.com/922rcZr8oR
— ®£B€L!$M ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ 👑 (@reddy39669321) September 21, 2025
Orey nee yabba trailer ekkada ra @DVVMovies 😭🙏🏻#TheyCallHimOG#OGTrailerDay#OGTrailer#OGvsOMI#TranceOfOMI#OGFirstTicketAuctionpic.twitter.com/POuizVzRcK
— Mega abhimani❤️🔥 (@mega_abhimanii) September 21, 2025
Boothulu thittalani undi kani... @DVVMovies 🙏
— Trend PSPK (@TrendPSPK) September 21, 2025
Fans picholu kadu deniki late avuthundi eppudu trailer release chestharane vishayam ayina cheppandi.
కత్తితో వీర లెవల్ లో ఎంట్రీ
హైదరాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కత్తితో వీర లెవల్ లో ఎంట్రీ ఇచ్చారు. కత్తి తిప్పుతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. పవనన్న అంటూ కేకలు వేశారు. భారీ వర్షంలో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఈవెంట్ కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. తమన్ సంగీతం అందించారు. ఈ నెల 25వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
డైరెక్టర్ సుజీత్ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... సుజీత్ తనకు ఎంతో పెద్ద అభిమాని అని చెప్పుకొచ్చారు. సుజీత్ తనకు కథను ముక్కలు, ముక్కలుగా చెప్పిన డైరెక్షన్ లో అదరగొట్టాడన్నారు. థమన్ ఈ సినిమాకు మరో హీరో అని తెలిపారు. ఈ సినిమాకు తాను పడిపోయానని డిప్యూటీ సీఎం అన్న విషయాన్ని కూడా మరిచిపోయానని పవన్ తెలిపారు. ఖుషి సినిమా తరువాత తన అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని తెలిసిందన్నారు. ఈ సినిమాను కూడా తాను ఎంతో ప్రేమించానన్నారు పవన్. సుజీత్ టీమ్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు,ఇలాంటి టీమ్ ఉంటే తాను రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదన్నారు పవన్. తాను సినిమాలను వదిలిన తనను మాత్రం అభిమానులు వదల్లేదని చెప్పుకొచ్చారు.