Samantha: వారి టార్చర్ తట్టుకోలేక బాగా ఏడ్చేశా.. సమంత ఎమోషనల్!

దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకేపై సమంత షాకింగ్ కామెంట్స్‌ చేసింది. వారితో పని చేయడం చాలా కష్టంగా ఉంటుందని, ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్ షూటింగ్ సమయంలో పని ఒత్తిడి తట్టుకోలేక ఒకరోజు బాగా ఏడ్చేశానని చెప్పింది. ‘సిటడెల్‌: హనీబన్నీ’ అనుభవాలు షేర్ చేసుకుంది.

author-image
By srinivas
New Update
drer

Samantha: స్టార్ నటి సమంత తన కెరీర్ లో ఎదురైన కష్టతకమైన అనుభవాలను షేర్ చేసుకుంది. అంతేకాదు బాలీవుడ్‌ దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకేపై షాకింగ్ కామెంట్స్‌ చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తమ కాంబోలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌ షూటింగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది. నిజంగా వారితో పని చేయడం చాలా కష్టంగా ఉంటుందని, సిరీస్ షూటింగ్ మధ్యలో ఒకరోజు బాగా ఏడ్చేశానని చెప్పింది.

ఇది కూడా చదవండి: Kodangal: కలెక్టర్ పై దాడి చేసిన వారికి బిగ్ షాక్.. రంగంలోకి డీజీపీ!

ఆ చిత్రాల్లో నటించడం బెటర్

ఈ మేరకు సమంత మాట్లాడుతూ.. రాజ్ అండ్‌ డీకేతో పని చేయడంకంటే తెలుగు, తమిళం చిత్రాల్లో నటించడం బెటర్. ప్రశాంతంగా ఉంటుంది.  సాధారణంగా ఒక రోజు ఒకటి లేదా మూడు సీన్స్‌ షూట్‌ చేస్తారు. కానీ వాళ్లు అలా కాదు. ఒక గంటలోనే సీన్స్‌ చిత్రీకరిస్తారు. రాజీ పాత్రకు సంబంధించిన ఫైట్‌ సీక్వెన్స్‌ మొదటి షెడ్యూల్‌లోనే పూర్తి చేశారు. కానీ అది నా వల్ల కాలేదు. రెండు రోజుల తర్వాత ఏడ్చుకుంటూ మా మేనేజర్‌కు ఫోన్‌ చేశా. ఇంటికి వెళ్లిపోతానని చెప్పాను. కానీ తర్వాత నెమ్మదిగా అలవాటు పడ్డాను' అంటూ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: చలికాలంలో తులసితో ఆస్తమాని ఇలా అడ్డుకోండి

చిన్నపిల్లలా ఏడ్చేసింది..

ఇక ‘సిటడెల్‌: హనీబన్నీ’ కోసం మరోసారి ఈ టీమ్‌తో కలిసి పని చేయడం తనకు బాగా నచ్చిందని చెప్పింది. ఇక సమంత గురించి రాజ్ అండ్‌ డీకే మాట్లాడుతూ.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సమయంలో సమంత ఎన్నోరకాల భావోద్వేగాలతో సతమతమైనట్లు మాకు తెలియదు. చెన్నైలో రెండు రోజులు షూట్‌ పూర్తి కాగానే ఆమె మా వద్దకు వచ్చి.. చిత్రీకరణ పూర్తైందా? లేదా ఇంకేమైనా చేయాలా? అని అడిగింది. మేము అయిపోయింది అని చెప్పగానే తను చిన్నపిల్లలా ఏడ్చేసిందని గుర్తు చేసుకున్నారు. ఇక ‘సిటడెల్‌: హనీ బన్నీ’లో సమంత, వరుణ్‌ ధావన్‌ కీలక పాత్ర పోషించగా నవంబర్‌ 7న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైంది.

ఇది కూడా చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు!

ఇది కూడా చదవండి: హిందూ మతంపై మాత్రమే ఎందుకు వ్యతిరేకం–వివేక రామస్వామి

Advertisment
Advertisment
తాజా కథనాలు