/rtv/media/media_files/2025/07/09/samantha-with-raj-nidimoru-2025-07-09-10-28-31.jpg)
Samantha with raj nidimoru
Samantha - Raj Nidimoru Dating: నటి సమంత- డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలంగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా సామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవలే అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) 2025 కార్యక్రమానికి వెళ్లిన సామ్ ఆ తర్వాత అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశారు.
వెకేషన్ ఫొటోలు
ఈ వెకేషన్ కి సంబంధించిన ఫొటోలు పంచుకోగా.. అందులో సామ్- రాజ్ నిడిమోరు తో కలిసి దిగిన చిత్రాలు(Samantha - Raj Nidimoru Photos) అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒక ఫోటోలో, సమంత, రాజ్ నిడిమోరు ఒకరికొకరు దగ్గరగా నడుస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు. మరో ఫోటోలో, వాళ్ళిద్దరూ స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నారు. దీంతో వీరిద్దరి రిలేషన్ షిప్ రూమర్లు మరోసారి తెరపైకి వచ్చాయి.
Also Read: యుగాంతం ఎఫెక్ట్.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు
Also Read:చేతుల్లో ఈరాయి ఉంటే చాలు థైరాయిడ్ కారణంగా పెరిగిన బరువుని తగ్గించుకోవచ్చు
గతంలో సమంత- రాజ్ నిడిమోరు 'ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి కొంతకాలంగా వీరిద్దరూ పలు ఈవెంట్లట్లో కలిసి కనిపించడం, చెట్టాపట్టాలేసుకొని తిరగడం డేటింగ్ రూమర్లకు తెరలేపింది. బర్త్ డే పార్టీలు, మ్యారేజ్ వేడుకలు, అవార్డు ఈవెంట్స్, మూవీ ప్రమోషన్స్ సహా మరెన్నో ఈవెంట్లలో వీరిద్దరూ కలిసి దర్శనమిచ్చారు. ఇటీవలే సామ్ నిర్మించిన 'శుభం' ప్రమోషనల్ వీడియోస్ లో కూడా రాజ్ సందడి చేశారు. ఈ సాయంలో సామ్ అతడితో క్లోజ్ గా దిగిన కొన్ని ఫొటోలను కూడా పంచుకుంది.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
ఇది కాస్త వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ డేటింగ్ వార్తలపై సమంత లేదా రాజ్ నిడిమోరు ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే తమ బంధం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఇదిలా ఉంటే సామ్ సన్నిహితులు మాత్రం వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని చెబుతున్నారు.