/rtv/media/media_files/2025/01/19/8GcaoBRU3RrGhNq45YPj.jpg)
Saif ali khan suspect Photograph: (Saif ali khan suspect )
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడు బంగ్లాదేశ్‌కి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
నిందితుడు భారతీయుడు కాదు..
నిందితుడి ఒరిజినల్ పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్. కానీ అతను విజయ్ దాస్‌గా మార్చుకుని ముంభైలో గత ఆరు నెలల నుంచి నివాసం ఉంటున్నాడు. దేశానికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు కార్డు కూడా తనకి లేదు. ఆరు నెలల క్రితం ముంబైకి వచ్చి హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. అయితే వారు సైఫ్‌ను హత్య చేయడానికి వచ్చారా? లేకపోతే దొంగతనం చేయడానికి వచ్చారా? అనే విషయాలను పోలీసులు విచారించారు.
ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
ఆ నిందితుడికి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలియదని పోలీసులకు తెలిపాడు. దొంగతనం చేయడానికి మాత్రమే వెళ్లినట్లు నిందితుడు చెప్పాడు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే సైఫ్ కనిపించడంతో కత్తితో దాడి చేసినట్లు తెలిపాడు. అయితే నిందితుడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర కూడా లేదు. బంగ్లాదేశ్ పౌరుడు అయితే అక్రమంగా భారత్‌లోకి ఎలా ప్రవేశించాడనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది కూడా చూడండి:RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!
ఇదిలా ఉండగా ముంబై బాంద్రాలో సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే, ఆ సమయంలో సైఫ్ మేల్కొని అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా, దొంగ కత్తితో దాడి చేసి సైఫ్‌ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతో పాటు శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని హాస్పిటల్ కి తరలించాడు. సైఫ్ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, వెన్నుముక భాగంలో పొడవడంతో అందులో ఉండే ద్రవం బయటకు వచ్చిందని డాక్టర్లు అన్నారు. కత్తిని బయటకు తీసి గాయాన్ని సరి చేశామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు