/rtv/media/media_files/2025/03/06/E8zklTZaAYZnB9LWad0W.jpg)
RC 16 Movie Photograph: (RC 16 Movie)
హీరో రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న RC16 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్, జాన్వీ కపూర్ కీలక సన్నివేశాలను పూర్తి చేశారట. త్వరలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు శివరాజ్ ఇంటికి వెళ్లి లుక్ టెస్ట్ కూడా చేశారు.
ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
Look test done ✅
— RC 16 (@RC16TheFilm) March 5, 2025
A terrific look locked 🔒
Karunada Chakravarthy @NimmaShivanna Garu will soon join the sets of #RC16 and begin shooting for his role ❤️🔥#RamCharanRevolts ✊🔥 pic.twitter.com/qyFWqPcdcv
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించే..
గత కొన్ని రోజుల నుంచి శివరాజ్ కుమార్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే బుచ్చిబాబు ఇంటికెళ్లి లుక్ టెస్ట్ చేశారు. మూవీ షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో శివరాజ్ కుమార్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే శివరాజ్ కుమార్ పాత్ర ఎలా ఉంటుందనే విషయం ఇంకా తెలియదు.
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో RC16 స్పోర్ట్స్ డ్రామాగా వస్తోంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని, ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఇటీవల బుచ్చిబాబు చెప్పిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!